Lokesh Kanagaraj: సినిమా అంటే కంప్లీట్ గా వినోదం. నవరసాలు కలగలిపిన కథా, కథనాలతో మంచి పాత్రలతో పవర్ ప్యాక్డ్ ప్రాడక్ట్ అయితేనే సేల్ అవుతుంది. ఇక, మన సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే కంప్లీట్‌గా ఫ్యాన్ బేస్డ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ, హీరోదే రాజ్యం. ఆ తర్వాత దర్శకుడిది. మూడవ స్థానం హీరోయిన్.
హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను అలరించడానికే. కొన్ని, సినిమాలలో అయితే..హీరోయిన్ గ్లామర్ వరకే పరిమితం అవుతుంది. అందచందాలతో, ఘాటు రొమాన్స్‌తో హీరోతో కలిసి స్క్రెన్ మీద కనిపించాలని అభిమానులు ఆశపడుతుంటారు. అంతేకాదు, సినిమాలో హీరోయిన్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎన్నో వందల సినిమాలు నిరూపించాయి.
సినిమా బిజినెస్ అవ్వాలంటే హీరోతో పాటు హీరోయిన్ కి క్రెడిబులిటీ ఉంటుంది. అందుకే, కొన్ని సినిమాలలో హిట్ పెయిర్ ఉంటే బిజినెస్ బాగా జరుగుతుంది. అయితే, కొన్ని సినిమాలలో అసలు హీరోయినే ఉండదు. ఇది, ఇప్పుడు మొదలవలేదు. ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా తమిళ సినిమాలలో హీరోయిన్ లేకుండా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. లోకేష్ కనగరాజ్ రూపొందించిన విక్రమ్, ఖైదీ సినిమాలలో హీరో, కథ తప్ప హీరోయిన్ ఉండదు.
అయినా, సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలలో కథే హీరో అనుకోవచ్చు. ఇప్పుడు, అల్లు అర్జున్ నటించబోతున్న సినిమాలోనూ లోకేష్ హీరోయిన్ పాత్రను రాయలేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ మీదే సినిమా మొత్తం ఉంటుందని కోలీవుడ్ మీడియా వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మన, తెలుగులో ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. పుష్ప ఫ్రాంఛైజీస్ లో రష్మిక మందన్న.. అల్లు అర్జున్ సరసన నటించింది. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో చేస్తున్న రాకా లోనూ మెయిన్ హీరోయిన్ దీపిక పడుకొనె. మరి, లోకేష్ - అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ లేకపోవడం ఒకింత షాకింగ్ విషయమే. ఇందులో, వాస్తవం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.












