The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ హీరోయిన్‌గా చేస్తున్న కీర్తి ఐటమ్ సాంగ్ ఒప్పుకోవడానికి కారణం ఏంటీ..ఇందులో నిజమెంత..అనేది పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నేను శైలజ సినిమాతో అడుగుపెట్టింది కీర్తి సురేష్. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత నాని సరసన నేను లోకల్ సినిమా చేసి మరో హిట్ అందుకున్న కీర్తి, మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ సినిమాతో, సౌత్ మొత్తం కీర్తికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాలలో వరుస ఆఫర్స్ వచ్చాయి.
అయితే, మహానటి తర్వాత చేసిన సినిమాలన్నీ కీర్తిని బాగా డిసప్పాయింట్ చేశాయి. మహానటి కోసం బొద్దుగా మారిన ఈ మలయాళ భామ ఆ తర్వాత చాలా సన్నగా తయారైంది. ఆ లుక్ కూడా కొంతవరకూ కెరీర్ మీద ఎఫెక్ట్ పడింది. అలాంటి సమయంలో నాని సరసన దసరా సినిమా చేసే అవకాం వచ్చి మంచి హిట్ అందుకుంది. నేచురల్ అండ్ రస్టిక్ లుక్ లో కీర్తి పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమా అయినా కూడా నాని-కీర్తిల పాత్రలను అద్భుతంగా మలిచాడు.
అయితే, మరోసారి నాని-శ్రీకాంత్‌లతో కలిసి కీర్తి సురేష్ వర్క్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ది ప్యారడజ్ సినిమాలో ఓ స్పెషల్ నంబర్ ఉండగా, దీని కోసం కీర్తిని అడిగారట. ఆల్రెడీ నానితో మంచి బాండింగ్ ఉంది. మేకింగ్ పరంగా శ్రీకాంత్ ఓదెల వర్క్ స్టైల్ తెలుసు. కాబట్టే, స్పెషల్ నంబర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి, ఇందులో ఎంతవరకూ నిజముందో అఫీషియల్ గా న్యూస్ వస్తే గానీ తెలీదు. కాగా, కయాదు లోహర్ నానికి జంటగా నటిస్తోంది.












