క్రైమ్

Crime : పారడైజ్ సెంటర్‌లో అర్ధరాత్రి డ్రగ్స్.. మహిళే సప్లయర్!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ప్రభుత్వాలు మారిన మాదకద్రవ్యాలు, గంజాయి అమ్మకాలు,వినియోగం తగ్గడం లేదు. కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. అమ్మేవాళ్లు గుట్టుగా నగరంలోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. డ్రగ్స్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.కొందరు అక్రమార్కులు ఈగల్ ఐ నుంచి కూడా తప్పించుకుని తిరుగుతున్నారు.

ప్రభుత్వాలు మారిన మాదకద్రవ్యాలు, గంజాయి అమ్మకాలు,వినియోగం తగ్గడం లేదు. కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. అమ్మేవాళ్లు గుట్టుగా నగరంలోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. డ్రగ్స్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.కొందరు అక్రమార్కులు ఈగల్ ఐ నుంచి కూడా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఈగల్ ఫోర్స్ ఆకస్మిక దాడులు చేసింది.

నగరం నడిబొడ్డున సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద మత్తు పదార్థులు డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగిల్ ఫోర్స్ తెలంగాణ, రామ్‌గోపాల్‌పేట్ పోలీసులతో కలిసి ‘కిమ్స్ సన్‌షైన్’ ఆస్పత్రి సమీపంలోని పారడైజ్ సర్కిల్ వద్ద డ్రగ్స్ డెలివరీ ప్రయత్నాన్ని భగ్నం చేశారు.

మెఫెడ్రోన్ డ్రగ్‌ను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 4 గ్రాముల మెఫెడ్రోన్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ సుమారు రూ.12 వేలుగా అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితుల్లో ఒక మహిళ ఉన్నట్టు సమాచారం. నగరంలో డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడంలో ఈ ఆపరేషన్ కీలకంగా మారిందని, కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇంతకూ వీరికి మత్తు పదార్థాలు ఎవరు సప్లయ్ చేస్తున్నారు? నగరంలోకి ఇవి ఎలా వస్తున్నాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

https://x.com/muchatlu_/status/2081828073201381686?s=20

#Paradise#drugs seize#police#hyderabad#arrest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి