తెలంగాణ

BallotBox : స్క్రాప్ దుకాణంలో బ్యాలట్ బ్యాక్స్.. ఎవరు అమ్మారు?

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఎన్నికల సమయంలో వినియోగించే బ్యాలట్ బ్యాక్స్ ఒక్కసారిగా పాతసామాను దుకాణంలో ప్రత్యక్షమైంది. గుర్తుతెలియని వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఎన్నికల సమయంలో మాత్రమే బ్యాలట్ బాక్సులను స్ట్రాంగ్ రూం నుంచి బయటకు తీస్తుంటారు.

ఎన్నికల సమయంలో వినియోగించే బ్యాలట్ బ్యాక్స్ ఒక్కసారిగా పాతసామాను దుకాణంలో ప్రత్యక్షమైంది. గుర్తుతెలియని వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఎన్నికల సమయంలో మాత్రమే బ్యాలట్ బాక్సులను స్ట్రాంగ్ రూం నుంచి బయటకు తీస్తుంటారు. కౌంటింగ్ పూర్తయ్యాక తిరిగి వాటిని మళ్లీ భద్రపరుస్తారు. అలాంటిది ఆ బాక్సు స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు ఎలా వచ్చింది? అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటన నల్లగొండలో జిల్లాలో వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని స్క్రాప్ షాప్‌లో బ్యాలట్ బాక్స్‌ను గుర్తించారు. ఎన్నికలు ముగిశాక స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాల్సిన బ్యాలట్ బాక్స్ బయటకు రావడంపై స్థానికంగా పెద్దఎత్తున చర్చ జరగుతున్నది.బాక్స్‌పై ఉన్న వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా గుర్తించారు.

అయితే, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆ బాక్స్ బయటకు ఎలా వచ్చింది? అధికారికంగా వేలం వేశారా? లేక అధికారులే ఎవరైనా బయట పడేశారా? అక్కడి నుంచి అది స్క్రాప్ దుకాణంలోకి వచ్చిందా? ఈ విషయం ఉన్నతాధికారులకు తెలుసా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

https://x.com/pulsenewsbreak/status/2081937264444338358?s=20

అయితే, మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఈ బాక్స్‌ను విక్రయించాడని షాప్ యజమాని వెల్లడించారు. బాక్స్ కూడా కాస్త తుప్పు పట్టినట్టు కనిపిస్తున్నది. మెయింటెన్స్ కూడా సరిగా చేయడం లేదని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

#BallotBox#srcap shop#nalgonda#video viral
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి