ఏపీలో తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదని దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ప్రభుత్వం లబ్దిదారుడి ఖాతాలో తల్లికి వందనం డబ్బులు వేయగా తీసుకునేందుకు వెళ్లిన దంపతులకు బ్యాంకు సిబ్బంది షాక్ ఇచ్చారు. మీరు పంట రుణం తీసుకున్నారని.. ఇంకా చెల్లించలేదని డబ్బులు ఇవ్వడం కుదరదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో కాసేపు అక్కడ వాగ్వాదం నెలకొంది.
ఎంతసేపటికీ బ్యాంకు సిబ్బంది నుంచి నో అనే సమాధానం రావడంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటనఏపీలోని కళ్యాణదుర్గంలో ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లికి వందనం డబ్బులు డ్రా చేయనివ్వలేదని దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత, భయానక వాతావరణం నెలకొంది.అయితే, కుందుర్పి కెనరా బ్యాంక్‌లో పడిన తల్లికి వందనం డబ్బులు విత్ డ్రా చేసేందుకు భర్త నాగేంద్రతో కలిసి చంద్రకళ వెళ్లింది.
https://x.com/YSRCParty/status/2081792988183986632?s=20
కానీ, చంద్రకళ మామ పేరిట క్రాప్ లోన్ పెండింగ్‌లో ఉండటంతో.. తల్లికి వందనం డబ్బు ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు.మామ పేరిట లోన్ పెండింగ్‌లో ఉంటే.. తన అకౌంట్‌లో పడిన డబ్బులు తీసుకోవడానికి అభ్యంతరమేంటని చంద్రకళ సిబ్బందిని నిలదీసింది. బ్యాంక్ సిబ్బంది ససేమిరా అనడంతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటి మీద పెట్రోల పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












