సినిమా

Official: ఇరుముడి విడుదల తేదీపై డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చిన రవితేజ

రచన: Anshu3 నిమిషాల పఠనం

Official: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇరుముడి. డివోషనల్ టచ్ కూడా ఇచ్చాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన గత చిత్రాలు నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషి కంటే భిన్నంగా ఇరుముడి సినిమా రూపొందుతోంది. ఇదొక తండ్రీ కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.

Official: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇరుముడి. డివోషనల్ టచ్ కూడా ఇచ్చాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన గత చిత్రాలు నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషి కంటే భిన్నంగా ఇరుముడి సినిమా రూపొందుతోంది. ఇదొక తండ్రీ కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.

రవితేజ కి మాస్ ఫాలోయింగ్, మాస్ ఆడియన్స్ ఎంతగా ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంతే ఉన్నారు. మొదటి నుంచి మాస్ మహారాజ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, అన్నీ వయసుల వారు మన రవితేజ సినిమా చూసేందుకు థియేటర్స్ కి వస్తున్నారు. అందుకే, మేకర్స్ అలాంటి కథలనే తయారు చేస్తున్నారు. మన టాలీవుడ్ లో ఉన్న మిగతా హీరోలు దాదాపు పాన్ ఇండియా సినిమాలవైపే మొగ్గు చూపుతున్నారు.

కానీ, రవితేజకి అలాంటివేమీ పట్టవు. ప్రేక్షకులకి నచ్చి నిర్మాతలకి డబ్బులొస్తే అదే పాన్ ఇండియా సినిమా అనే లెక్కలో ఉంటాడు. అల్టిమేట్‌గా సినిమా హిట్ కొట్టాలి. అది, ఎలాంటి కథైనా సరే. ఆ రకంగానే తన సినిమా కథలను ఎంచుకుంటున్నాడు. అలా, ఇరుముడి సినిమాతో ఈ ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో, హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ నటించింది.

అయితే, నిన్నా మొన్నటి వరకూ ఇరుముడి సినిమా విడుదల వాయిదా పడొచ్చుననే మాట బలంగా వినిపించింది. సోషల్ మీడియాలోనూ అదే ప్రచారం జరుగుతోంది. దీంతో, మేకర్స్ తాజాగా క్లారిటీ ఇస్తూ కొత్త పోస్టర్‌ను వదిలారు. రవితేజ, పాప ఉన్న పిక్ వదిలి..అందులో విడుదల తేదీని ప్రకటించారు. అనుకున్న తేదీకి ఇరుముడి సినిమాను తీసుకువస్తున్నట్టుగా అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. దీంతో, ఇప్పటి వరకూ వచ్చినవన్నీ గాసిప్స్ అని తేలిపోయింది.

#raviteja#irumudi#Shivanirvana#priyabhavanishankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి