Jai Hanuman: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య మైథలాజికల్ మూవీస్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి సినిమాలలో పౌరాణిక, చారిత్రాత్మక, జానపద పాత్రల్లో నటించడానికి మన స్టార్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ ఆదిపుష్ సినిమాలో నటించాడు. వారణాసి సినిమాలో కూడా మహేష్ శ్రీరాముడి అవతారంలో కనిపించబోతున్నాడు.
కల్కి సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటించి సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఇప్పుడు, ఇదే అశ్వద్ధామ పాత్రను టాలీవుడ్ టాల్ హీరో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రానా దగ్గుబాటి పోషించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ తాజా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్‌గా మారింది.
బాహుబలి సిరీ తర్వాత మళ్ళీ ఇలాంటి భారీ రోల్ రానా చేయలేదు. నిర్మాతగా కొనసాగుతున్నాడు. హీరోగా చేయడానికి, రానాకి తగ్గ కథలు కూడా రావడం లేదు. అందుకే, ఈ మధ్య ఎక్కడా కనిపించలేదు. అయితే, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిననున్న జై హనుమాన్ సినిమా కోసం రానా ను సంప్రదించినట్టుగా సమాచారం.
అశ్వద్ధామ లాంటి, పవర్ ఫుల్ రోల్ లో నటించడానికి, ఈ కటౌట్ సరిగ్గా సరిపోతుంది. అందుకే, రానా కూడా పూర్తి స్థాయిలో తన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకొని ప్రశాంత్ వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో, దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట. హనుమంతుడిగా రిషబ్ శెట్టి, అశ్వద్ధామ గా రానా గనక సినిమాలో కనిపిస్తే ప్రేక్షకులు అయ్యే థ్రిల్ ఊహించడం కష్టం. కాగా, ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ కలిసి నిర్మిస్తున్నాయి.












