తెలంగాణ

TG : భూమి ఇవ్వకపోతే ట్రాక్టర్‌తో తొక్కిస్తా.. తల్లిదండ్రులకు బెదిరింపులు!

రచన: Kumar3 నిమిషాల పఠనం

పున్నామా నరకం నుంచి రక్షించే వాడిని కొడుకు అంటారని ఒక నానుడి ఉంది. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి రక్షించడం ఏమో కానీ, బతికుండానే వారికి నరకం చూపిస్తున్నారు కొందరు తనయులు..

పున్నామా నరకం నుంచి రక్షించే వాడిని కొడుకు అంటారని ఒక నానుడి ఉంది. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి రక్షించడం ఏమో కానీ, బతికుండానే వారికి నరకం చూపిస్తున్నారు కొందరు తనయులు.. ఆస్తి కోసం కనిపెంచిన వారిని సైతం కడతేరుస్తున్నారు.వేధించడం, కొట్టడం, బెదిరింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు. వృద్ధ్యాప్య సమయంలో బుక్కెడు తిండిపెట్టకుండా వారిని అరిగోస పెడుతున్నారు.

తాజాగా ఓ తనయుడు తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కిస్తా అని బెదిరింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆస్తి వివాదం కారణంగా వృద్ధ దంపతులను చంపేస్తానని కన్నకొడుకు బెదిరించాడు. దీంతో తమకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే 'కారుణ్య మరణానికి' అనుమతి ఇవ్వాలని కోరుతూ శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ వృద్ధ దంపతులు ఆర్డీవోను ఆశ్రయించారు.

https://x.com/TeluguScribe/status/2081959899597254952?s=20

తమను రక్షించాలని వేములపల్లి పోలీసులను సదరు బాధితులు ఆశ్రయించగా ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడని ఆర్డీవోకు విన్నవించారు. తమకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచామని.. తమ వైద్య ఖర్చుల కోసం మూడు ఎకరాల 11 గుంటల భూమిని తమను చూసుకుంటున్న మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, దానిలో కూడా వాటా ఇవ్వాలని పెద్ద కుమారుడు వేధిస్తున్నాడని వృద్ధ దంపతులు వాపోయారు.

గతంలో వీల్‌చైర్‌లో ఉన్న తనపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని.. అయినా, వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ట్రాక్టర్‌తో తొక్కిస్తామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఆర్డీవోను ఫిర్యాదుచేశారు.

#oldage parents#complaint#RDO#Son threatening#land issue
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి