అమెరికాలో అద్భుతం చోటుచేసుకుంది. ఓ బీచ్‌లో రాకాసి అలలకు కొట్టుకుపోతున్న ఓ బాలుడిని ఏ మాత్రం అనుభవం లేని లైఫ్ గార్డు రక్షించడం స్థానికంగా చర్చనీయాశంమైంది. బీచులో సరదాగా సర్ఫింగ్ చేస్తున్న బాలుడికి ఉన్నట్టుండి రాకాసి అలలు ఎదురయ్యాయి. బాలుడికి ఏం చేయాలో తెలియక, బయటపడేందుకు ప్రయత్నించి అందులో చిక్కుకున్నాడు.చివరకు అలలు బాలుడిని ముంచేశాయి.
అక్కేడే ఉన్న పలువురు అలల్లో బాలుడు మునుగుతూ తేలుతూ కనిపించడాన్ని గుర్తించారు.అలల తీవ్ర ఎక్కువగా ఉండటంతో ఎవరూ ముందుకు వెళ్లేందుకు సాహసం చేయలేదని తెలుస్తోంది. అయితే, ఓ లైఫ్ గార్డు మాత్రం ఎట్టేకేలకు ధైర్యం చేశాడు. అలలతో పోరాడి బాలుడిని ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని సైప్రస్ బీచ్‌లో వెలుగుచూసింది.
ఫొటోగ్రాఫర్ స్కాట్ ఫొటోలు తీస్తుండగా భారీ అలల్లో ఓ బాలుడు కనిపించి మాయమవుతుండటాన్ని గమనించి వెంటనే లైఫ్‌గార్డ్‌కు సమాచారం అందించినట్టు తెలిసింది. సర్ఫ్‌బోర్డ్‌పై అలలను ఆస్వాదిస్తున్న బాలుడికి పదేళ్లు ఉంటాయని గుర్తించారు. లైఫ్‌గార్డ్ వెంటనే సముద్రంలోకి దిగి బాలుడిని గట్టిగా పట్టుకుని అలలను దాటుకుని రక్షించాడు.
https://x.com/muchatlu_/status/2081826969310859468?s=20
సహాయం చేసేందుకు వచ్చిన మరికొందరు అలల తీవ్రతను తట్టుకోలేక వెనక్కి తగ్గారు. లైఫ్‌గార్డ్ మాత్రం వెనుదిరగకుండా బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ లైఫ్‌గార్డ్‌కు ఇదే తొలిసారి అలా సాహసం చేయడం. అయినప్పటికీ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి బాలుడి ప్రాణాలను కాపాడటంతో అంతా మెచ్చుకున్నారు. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుండగా..అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.












