తెలంగాణ

TG: చిన్నారులకు రక్షణ ఏది?.. పెరుగుతున్న పోక్సో కేసులు, సర్కార్ వైఫల్యం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణలో చిన్నారుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజురోజుకూ పిశాచాల బారినపడి చిన్నారి జీవితాలు నలిగిపోతుంటే, వారిని కాపాడటంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక మూల చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నప్పటికీ, బాధ్యత వహించాల్సిన హోంశాఖ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

తెలంగాణలో చిన్నారుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజురోజుకూ పిశాచాల బారినపడి చిన్నారి జీవితాలు నలిగిపోతుంటే, వారిని కాపాడటంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక మూల చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నప్పటికీ, బాధ్యత వహించాల్సిన హోంశాఖ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

గత ఏడాది ఏకంగా 3,029 పోక్సో (POCSO) కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితులకు అండగా నిలవాల్సిన వ్యవస్థలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేసు నమోదైన తర్వాత బాధితులకు తగిన భద్రత కల్పించడం, వారికి మానసిక ధైర్యాన్నిచ్చేలా కౌన్సిలింగ్ ఇవ్వడం, నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టడం వంటి కీలక అంశాల్లో సంబంధిత శాఖల మధ్య ఏమాత్రం సమన్వయం కనిపించడం లేదు. ఫలితంగా దాడులకు గురైన చిన్నారుల కుటుంబాలు తీవ్ర ప్రాణహానిని, భయాందోళనలను ఎదుర్కొంటున్నాయి.

ఇటీవల చోటుచేసుకున్న షాబాద్ దారుణ ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మరోవైపు, జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ప్రొబేషన్ అధికారులు తమ విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు అవసరమైన న్యాయ, సామాజిక సహాయాన్ని అందించడంలో ఈ అధికారులు విఫలమవుతుండటంతో నేరస్తులు మరింత పేట్రేగిపోతున్నారు. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ, వాటి అమలులో జరుగుతున్న జాప్యం, అధికారుల అశ్రద్ధ కామాంధులకు చుట్టంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో ప్రతిరోజూ పోక్సో కేసులు నమోదవుతున్నా, ఈ వికృత చేష్టలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సామాజికవేత్తలు, హక్కుల నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కేవలం కేసులు నమోదు చేయడానికే పరిమితం కాకుండా, బాధితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకోకపోతే బాల్యానికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#POCSO#TelanganaNews#ChildSafety#POCSOCases#ShahbadIncident#TelanganaPolice
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి