వైరల్ న్యూస్

Anna Konidela: ఇకపై నన్ను అలాగే పిలవండి.. పవన్ కల్యాణ్ భార్య భావోద్వేగ పోస్ట్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, మీడియాకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. తన ఇంటిపేరుపై చాలాకాలంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్న ఆమె, ఇకపై తనను 'అన్నా లెజినోవా' అని కాకుండా 'అన్నా కొణిదెల' అని మాత్రమే సంబోధించాలని కోరారు. తన జన్మదిన సందర్భంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వడానికి ఇదే సరైన సమయమని భావించి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించినట్లు తెలిపారు.

కేవలం తమ వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే లెజినోవా అనే పేరు ఉండిపోయిందని, పెళ్లయిన నాడే తాను భర్త ఇంటిపేరును స్వీకరించి 'అన్నా కొణిదెల'గా మారానని ఆమె స్పష్టం చేశారు. తన అసలు పేరు అదేనని, ఆ పేరుతోనే తాను సంపూర్ణంగా ఉన్నట్లు భావిస్తున్నానని భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ సందేశంతో పాటు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు తాము కలిసి వెళ్లిన తొలి పర్యటనలో పవన్ కల్యాణ్‌తో దిగిన ఒక అందమైన జ్ఞాపకాన్ని ఆమె పంచుకున్నారు.

ఆ ఫొటోలో పవన్ స్టైలిష్ లుక్‌లో కనిపించగా, ఆయన పక్కన అన్నా చిరునవ్వుతో కనిపించారు. అన్నా కొణిదెల చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన స్వల్ప వ్యవధిలోనే వేలాది మంది అభిమానులు, జనసేన శ్రేణులు స్పందిస్తూ "ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం వదినమ్మా" అంటూ కామెంట్ల రూపంలో మద్దతు తెలుపుతున్నారు.

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి చారిత్రాత్మక విజయం సాధించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారంలోనూ, జనసేన పార్టీ సాధించిన విజయవంతమైన ఘట్టాల్లోనూ అన్నా కొణిదెల ఆయనకు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచారు. ఇప్పుడు ఆమె పంచుకున్న ఈ వ్యక్తిగత ప్రకటన సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మెగా అభిమానులందరూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.

https://www.instagram.com/p/DbTK7EfjcUv/?utm_source=ig_embed&ig_rid=A7JFVnOfkeI9nYEQi52MATE

#AnnaKonidela#PawanKalyan#AnnaLezhneva#Janasena#MegaFamily#TollywoodUpdates#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి