సినిమా

Anil Ravipudi: హీరోలను కాదని దర్శకుడి డేట్స్ బ్లాక్ చేసుకుంటున్న నిర్మాతలు!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Anil Ravipudi: మన సినిమా ఇండస్ట్రీలో హీరోలదే పైచేయి. హీరో మీదే సినిమా బిజినెస్ జరుగుతుంది. ఆ హీరోకున్న క్రేజ్ ని బట్టే బాక్సాఫీస్ వద్ద టికెట్స్ తెగుతాయి. సరికొత్త రికార్డ్స్ నమోదవుతాయి. అయితే, కొన్నిసార్లు దర్శకుడుని చూసి కూడా సినిమాకొచ్చిన ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి దర్శకులు అప్పట్లో రాఘవేంద్రరావు, బాబు-రమణ, ఎ.కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, బి.గోపాల్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.

ఆ తర్వాత, పూరి జగన్నాధ్ కి అలాంటి క్రేజ్ వచ్చింది. ఆయన దర్శకుడు అంటే సినిమా ముందే భారీ స్థాయిలో బిజినెస్ కంప్లీట్ అయ్యేది. అలాగే, రాజమౌళి. జక్కన్న సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే బిజినెస్ లెక్కకు మించే ఉంటుంది. ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి చేరారు. వీరిద్దరికంటే అనిల్ రావిపూడి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారట.

నిర్మాతలే కాదు, హీరోలు అనిల్ దగ్గర కథ ఉందా..! అని ఆరా తీసి, నెక్స్ట్ సినిమా మనం చేద్దామనే సంకేతాలు పంపిస్తున్నారట. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి..మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. స్వతాహాగా మంచి రచయిత కావడంతో, హీరోకి తగ్గ కథ-కథనాలు, మంచి డైలాగులు..సాలీడ్ కామెడీతో సినిమా తీసి హిట్ ఇస్తున్నాడు.

కళ్యాణ్ రామ్, రవితేజ, సాయి ధరమ్ తేజ్, వెంకటేష్, వరుణ్ తేజ్, నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి..ఇలా ఎవరితో సినిమా చేసినా, అది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టరే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్-కృతి శెట్టి హీరోయిన్స్. ఇలా మొదలైందో లేదో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

ఈ స్పీడ్ చూసే నిర్మాతలు-హీరోలు అనిల్ రావిపూడితో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారు. అనుకున్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ చేయడం..అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం..హీరోకి హిట్టు..నిర్మాతకి డబ్బులు తెచ్చిపెడుతున్నాడు. అందుకే, ఇప్పుడు అనిల్ రావిపూడి డేట్స్ హాట్ కేక్స్ గా మారాయి. ఆయన డేట్స్ కావాలని బడా నిర్మాణ సంస్థలు సూట్ కేసులతో క్యూ కడుతున్నారు. ఈ వెల్లువ ఎంతకాలం ఉంటుందో గానీ, వరుస విజయాలతో మాత్రం అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.

#anilravipudi#venkatesh#kalyanram#keerthysuresh#krithisetty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి