సినిమా

Jr NTR: మరో టాలీవుడ్ స్టార్ కి గాయాలు..కోలుకోవడానికి 8 వారాలు!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Jr NTR: మన టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల కోసం కష్టపడి గాయాలపాలవుతున్న సంగతి తెలిసిందే. పెద్ది సినిమా కోసం కుస్తీ పోటీల్లో పాల్గొన్న రామ్ చరణ్ మణికట్టుకి దెబ్బ తగిలింది. దాంతో, ఆయనకి కోయంబత్తూరులో సర్జరీని నిర్వహించారు. ఈ సోమవారం విజయవంతంగా సర్జరీ పూర్తైంది. అలాగే, నందమూరి బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు.

ఆయనను హైదరాబాద్ తరలించి సర్జరీ జరిపించారు. వీరిద్దరికంటే ముందే, పవన్ కళ్యాణ్ కూడా భుజానికి సర్జరీ చేయించుకున్నారు. ఇలా, మన స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవడం, సర్జరీలు చేయించుకోవడంతో వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రీలో కూడా ఇదొక పెద్ద కలవరపాటుగా మారింది.

ఇలాంటి సమయంలో మరో టాలీవుడ్ స్టార్ హీరోకి గాయం అయింది. ఆ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్‌. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ డ్రాగన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా ఆయన భుజానికి గాయమైనట్టు ఎన్టీఆర్‌ ఆఫీసు నుంచి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కి హాస్పిటల్‌లో చికిత్స జరుగుతున్నట్టు వెల్లడించారు.

అయితే, ఇదేమంత ప్రమాదం కాదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటనలో తెలిపారు. ఇక, వైద్యుల బృందం డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో ఎన్టీఆర్‌ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కనీసం 6 నుండి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మళ్ళీ యదావిధిగా షూటింగ్‌లో పాల్గొనవచ్చునని తెలుస్తోంది.

#jrntr#prashanthneel#dragon#rukminivasanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి