Health

Health: భోజనం తర్వాత నిద్రపోవడం మంచిదా?.. సైంటిఫిక్ రీజన్ ఇదే!

రచన: Venu4 నిమిషాల పఠనం

రోజంతా ఆఫీస్ పని.. ఇంటి పనులు.. ప్రయాణాలు.. ఒత్తిడి.. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు శరీరం, మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కళ్లు మూతపడటం చాలామందికి సహజమే.

రోజంతా ఆఫీస్ పని.. ఇంటి పనులు.. ప్రయాణాలు.. ఒత్తిడి.. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు శరీరం, మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కళ్లు మూతపడటం చాలామందికి సహజమే. అయితే.. మధ్యాహ్నం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదా? లేక రాత్రి నిద్రను దెబ్బతీస్తుందా?

పరిశోధనలు చెబుతున్న విషయం ఏంటంటే.. సరైన సమయంలో, సరైన వ్యవధిలో తీసుకునే చిన్నపాటి మధ్యాహ్న నిద్ర శరీరానికి, మెదడుకు ప్రయోజనకరంగా ఉండొచ్చు. దీనినే సాధారణంగా పవర్ నాప్ అంటారు.

మధ్యాహ్నం 10 నుంచి 20 నిమిషాల పాటు కునుకు తీయడం వల్ల అలసట తగ్గి, మెదడు మళ్లీ చురుగ్గా మారే అవకాశం ఉంటుంది. పనితీరు మెరుగుపడటంతో పాటు.. మానసిక ఒత్తిడి కూడా కొంత తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా రాత్రి నిద్ర సరిగా లేకపోవడం, ఎక్కువసేపు పని చేయడం లేదా శారీరకంగా అలసిపోయిన సందర్భాల్లో చిన్నపాటి నిద్ర తాత్కాలికంగా శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడుతుందని తెలుపుచున్నారు.

సాధారణంగా 10 నుంచి 20 నిమిషాల నిద్ర చాలా మందికి సరిపోతుంది. 30 నిమిషాలకు మించి నిద్రపోతే కొందరికి నిద్రలేచిన తర్వాత కొంతసేపు బద్ధకం, తల బరువుగా అనిపించడం లేదా మెదడు మందగించినట్లు అనిపించవచ్చు. దీనినే స్లీప్ ఇనర్షియా అంటారట..

ఇక 90 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మధ్యాహ్నం నిద్రపోవడం అలవాటుగా మారితే.. రాత్రి నిద్రపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, నిద్ర సమయం మారిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అయితే ప్రతి ఒక్కరి నిద్ర అవసరాలు, ఆరోగ్య పరిస్థితులు, రోజువారీ జీవనశైలి వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి.. మధ్యాహ్నం నిద్ర మంచిదా? చెడ్డదా? అనే ప్రశ్నకు సమాధానం లేదంటున్నారు..

సరైన సమయంలో.. తక్కువ వ్యవధిలో తీసుకునే పవర్ నాప్ శరీరానికి, మెదడుకు విశ్రాంతినివ్వవచ్చు. కానీ.. రాత్రి నిద్రకు ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ ఎక్కువసేపు మధ్యాహ్నం నిద్రపోవడం మాత్రం సరైన అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోయినా రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, రోజంతా అధిక నిద్రమత్తు వంటి సమస్యలు ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#health#sleep#after meals#scientific reason#Brain
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి