Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పై ప్రయాణిస్తున్న సుమోపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 13మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. లాహౌల్-స్పితి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో క్యాబ్ శిథిలాల కింద కూరుకుపోయింది. కుల్లు నుండి పాంగికి ప్రయాణిస్తున్న టాటా సుమో వాహనంపై రాళ్లు పడ్డాయి. వాహనం శిథిలాల కింద కూరుకుపోయింది.
ఈ ఘటనలో వాహనం నుజ్జునుజ్జు అయింది. లాహౌల్-స్పితి జిల్లాలోని ఉదయ్‌పూర్-కిల్లార్ మార్గంలో కహు-డు నాలా సమీపంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయ. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణాలతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












