Saudi Prince: గత ఏడాది నవంబర్ లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహాద్ లండన్ లోని ఓ లగ్జరీ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, ఆయన మరణం మిస్టరీగా మారింది. ఎలా చనిపోయారు అనేది అంతుచిక్కలేదు. తాజాగా ఆయన మృతికి గల కారణాలపై క్లారిటీ వచ్చింది. దర్యాఫ్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పెద్ద మొత్తంలో డ్రగ్స్ కలిపిన మద్యం తీసుకోవడం వల్లే ఆయన చనిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
29 ఏళ్ల సౌదీ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహాద్ 2025 నవంబర్‌లో లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో బస చేశారు. నవంబర్ 25న హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
రాజకుటుంబం కావడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు జరిపారు. తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడించారు. యువరాజు అబ్దుల్లా పెద్ద మొత్తంలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అదే సమయంలో మద్యం మానేయడానికి మెడిసిన్స్ కూడా వాడుతున్నాడు. డ్రగ్స్, డ్రింక్స్, మెడిసిన్స్ అన్నీ ఒకేసారి తీసుకోవడంతో.. వాటి కలయిక గుండెపోటుకు దారితీసి మరణం సంభవించిందని అధికారులు వెల్లడించారు.
టాక్సికాలజీ పరీక్షలలో ప్రిన్స్ అబ్దుల్లా రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ గాఢత ఉన్నట్లు తేలిందని విచారణలో వెల్లడైంది. ఇది ఇంగ్లాండ్ చట్టబద్ధమైన డ్రింక్-డ్రైవింగ్ పరిమితి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. కేవలం ఈ ఆల్కహాల్ స్థాయి మాత్రమే కోమాకు దారితీయగలదని నిపుణులు కోర్టుకు తెలిపారు.
సాధారణంగా పార్టీ డ్రగ్‌గా పిలువబడే గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్ (GHB) ప్రాణాంతక స్థాయిలలో ఉండటంతో పాటు గంజాయి, జానాక్స్ ఇతర ఆందోళన నివారణ మందుల ఆనవాళ్లను కూడా చికిత్సా మోతాదులో కనుగొన్నారు. ఈ పదార్థాల కలయిక గుండెపోటుకు దారితీసి, చివరికి ఆయన మరణానికి కారణమైందని వైద్య నిపుణులు నిర్ధారించారు.
Saudi Prince, London Hotel, Over Dose, Abdullah bin Fahad, Drinks, Swechaa News,












