Jana Nayagan: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా దూసుకుపోయిన పూజా హెగ్డేకు కాలం పెద్దగా కలిసిరావడం లేదు. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పరాజయాలు మాత్రం ఆమెను వీడటం లేదు. తాజాగా తమిళంలో దళపతి విజయ్ సరసన నటించిన ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజప్పాయింట్ చేసింది. భారీ అంచనాల నడుమ జూలై 23న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో తీవ్ర నిరాశ పరిచింది.
తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా ఘన విజయం సాధించిన ‘భగవంత్ కేసరి’ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మక్కీకి మక్కీ రీమేక్ చేయకపోయినా, ఆ కథలోని మూల భావాన్ని, పాత్రల స్వభావాన్ని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చే ప్రయత్నం చేశారు. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ దేవోల్, మమిత బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అనిరుధ్ అందించిన సంగీతం కూడా ఈ పరాజయాన్ని కాపాడలేకపోయింది.
ఈ సినిమా ఫ్లాప్‌తో పూజా హెగ్డే తమిళ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పటికే తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో సరైన విజయం లేక వెనకబడిన ఈ బుట్టబొమ్మకు, కోలీవుడ్‌లోనూ గట్టి దెబ్బ తగిలింది. విజయ్ వంటి పెద్ద స్టార్ సరసన నటించినా లక్ కలసిరాకపోవడంతో.. తమిళంలో పూజా మూటముల్లి సర్దుకోవాల్సిందే అన్న కామెంట్స్ వినిపిస్తున్నారు. మరి వరుస పరాజయాల నేపథ్యంలో తమిళంలో పూజ కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్లేనా, లేక మళ్లీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా అనేది వేచి చూడాలి.












