International

Argentina: మెస్సీ రిటైర్మెంట్‌కు రంగం సిద్ధం.. వీడ్కోలుపై బిగ్ అప్‌డేట్!

రచన: Venu5 నిమిషాల పఠనం

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ఆటతో శాసించిన లియోనెల్ మెస్సీ.. చిన్న వయసులోనే మైదానంలోకి అడుగుపెట్టాడు. 2004లో బార్సిలోనా తరఫున సీనియర్ జట్టులో అరంగేట్రం చేశాడు. తర్వాత గోల్స్, రికార్డులు, ట్రోఫీలతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ఆటతో శాసించిన లియోనెల్ మెస్సీ.. చిన్న వయసులోనే మైదానంలోకి అడుగుపెట్టాడు. 2004లో బార్సిలోనా తరఫున సీనియర్ జట్టులో అరంగేట్రం చేశాడు. తర్వాత గోల్స్, రికార్డులు, ట్రోఫీలతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన ప్రస్థానాన్ని ఇప్పటి వరకు జోరుగా కొనసాగిస్తున్న లియోనెల్ మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

ఈ టోర్నీలో ఏకంగా 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో మెస్సీ అద్భుత ప్రదర్శన చేశాడు. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి పాలవడంతో.. మెస్సీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై మెస్సీ పెద్దగా స్పందించలేదు. మరోవైపు హెడ్ కోచ్ లియోనెల్ స్కలోని మాత్రం.. మెస్సీ కోసం జాతీయ జట్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశాడు.

అయితే తాజాగా అర్జెంటీనా మీడియా మాత్రం.. మెస్సీ రిటైర్మెంట్‌కు సంబంధించిన కీలక టైమ్‌లైన్‌ను వెల్లడించింది. ఇప్పుడే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు చెప్పడని తెలిపింది. కొన్ని నెలల పాటు అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఆడాలని అనుకుంటున్నట్టు పేర్కొంది. మరోవైపు ఈ దిగ్గజ లెజెండ్ కి మరొక వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే ఉద్దేశం లేదని, త్వరలోనే తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా ముగింపు పలకడానికి రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది..

ఇక లియోనల్ మెస్సీ ప్రయాణం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అనేక మలుపులతో కొనసాగింది. ఆట మొదట్లో వరుసగా ఫైనళ్లలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.. కానీ క్రమక్రమంగా ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా అర్జెంటీనాను నడిపించాడు. మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 2021 కోపా అమెరికా, 2022 ఫైనలిసిమా, 2022 ఫిఫా వరల్డ్ కప్, 2024 కోపా అమెరికా ట్రోఫీలని అందుకుంది.

అయితే.. ఫుట్‌బాల్ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మెస్సీకి నంబర్ 10న అంతర్జాతీయ వీడ్కోలు కూడా.. ఆయన కెరీర్‌లాగే అద్భుతంగా, చరిత్రలో నిలిచిపోయేలా ఉండబోతోందట! అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్.. మెస్సీ కోసం ప్రత్యేకంగా ఓ భారీ ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జెంటీనా లో జరగనున్న ఈ హైప్రొఫైల్ మ్యాచ్.. కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య ఫుట్‌బాల్ హీరోకి ఘనంగా వీడ్కోలు పలికే అద్భుత వేదికగా మారనుంది. మెస్సీకి ఇది ఓ వీడ్కోలు కాదు.. ఓ స్వర్ణయుగానికి ముగింపు!

#International#Lionel Messi#football#retirement#Major update
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి