తెలంగాణ

Breking : మోడీ జాగ్రత్త.. తరం మారింది.. స్వరమూ మారుతోంది : కేటీఆర్

రచన: Kumar5 నిమిషాల పఠనం

నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో

నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పెద్దఎత్తున ధర్నా చౌక్ వద్దకు చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది.

ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లదుస్తుల్లో వచ్చి విద్యార్థులకు తన మద్దతును ప్రకటించారు. అలాగే కేంద్రం తీరును నిరసిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా పలువురు విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయాలని, విద్యార్థుల మీద జరిగిన దమనకాండను తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యారంగంలో సంస్కరణలు తేవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. పోలీసు జులుం నశించాలని నినాదాలు చేశారు.అనంతరం కేంద్రంలోని మోడీ సర్కారుకు హెచ్చరికలు చేశారు.

‘తరం మారుతుంది, స్వరం మారుతుంది మోడీ.. జాగ్రత్తగా ఉండునేపాల్‌లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయింది. ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదు. కానీ విద్యార్థులు మాకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారు. నువ్వు అనవసరంగా GenZ తరంతో పెట్టుకున్నావు మోడీ’ అని ఫైర్ అయ్యారు.

https://x.com/TeluguScribe/status/2080558284919226625?s=20

‘కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు. బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు.మోడీని అంటే ఈ కేడీ గాడికి ఏం అయింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కున్నది’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కేటీఆర్ కామెంట్స్ చేశారు.

‘రేప్ కేసులలో బీజేపీ నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది. కానీ మాకు న్యాయం ఎందుకు జరగడంలేదని విద్యార్థులు అడుగుతున్నారు.8 మంది బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా?. దేశం కోసం ధర్మం కోసం అంటారు, ఈ పిల్లలు హిందువులు కాదా?’ అని కేటీఆర్ బీజేపీ ఎంపీలను నిలదీశారు.

‘అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు. ఆయన సోషల్ మీడియాలో మీ ఆందోళన చూసి తల్లడిల్లిపోతున్నాడు. పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పాడు’ అని కేటీఆర్ విద్యార్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

#Indira park#students protest#CJP#BRSV#KTR#NEET
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి