సినిమా

Janhvi Kapoor: జాన్వీ టాలీవుడ్ లో హీరోయిన్ గా కంటే ఐటం భామగా బెస్ట్ అంటున్నారెందుకు?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ కిడ్, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఆరంభంలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టిన ఈ భామ, ఆ తర్వాత రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో మెరిసింది. అయితే, ఎంత భారీ ప్రాజెక్టులు చేసినా... ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ కిడ్, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఆరంభంలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టిన ఈ భామ, ఆ తర్వాత రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో మెరిసింది. అయితే, ఎంత భారీ ప్రాజెక్టులు చేసినా... ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జాన్వీ లీడ్ హీరోయిన్‌గా కంటే ఐటమ్ భామగా అయితేనే బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు!

జాన్వీ కపూర్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ ఆమె గ్లామర్, దానికి తోడు మైండ్ బ్లాకింగ్ డాన్స్ స్కిల్స్. శ్రీదేవి వారసత్వంగా వచ్చిన నాట్యకళ ఆమె ఒంటి నిండా ఉంది. బాలీవుడ్ పాటలైనా, సౌత్ మాస్ బీట్లయినా జాన్వీ వేసే స్టెప్పులు, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇటీవల 'దేవర'లోని "చుట్టమల్లే" పాటలో ఆమె గ్లామర్ అండ్ డాన్స్ మూవ్స్ ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సినిమాలో కథ లేదా నటన కంటే, ఆ ఒక్క పాటలోనే ఆమె ప్రజెన్స్ థియేటర్లను షేక్ చేసింది.

అలాగే పూర్తి నిడివి ఉన్న హీరోయిన్ పాత్రలు చేసినప్పుడు జాన్వీ నటనపై రకరకాల విమర్శలు వస్తుంటాయి. ఎమోషనల్ సీన్స్, డైలాగ్ డెలివరీ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఆమె నుంచి శ్రీదేవి స్థాయి మ్యాజిక్ ఆశిస్తారు. కానీ, అంతటి పరిపక్వత ఆమె నటనలో ఇంకా కనిపించడం లేదనేది నెటిజన్ల టాక్. అదే సమయంలో, కేవలం ఒక పాటలో మెరిసే స్పెషల్ గ్లామరస్ రోల్స్ లో ఆమె ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటోంది. సీన్ల వారీగా చూస్తే బోర్ కొట్టించే అవకాశం ఉంది కానీ, ఒక మూడు నిమిషాల పాటలో మాత్రం ఆమె పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది.

గతంలో తమన్నా, పూజా హెగ్డే వంటి అగ్ర కథానాయికలు కూడా హీరోయిన్లుగా నటిస్తూనే స్పెషల్ సాంగ్స్‌లో మెరిసి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ పాటలు బాక్సాఫీస్ వద్ద సినిమాలకు అదనపు మైలేజ్ ఇచ్చాయి. ఇప్పుడు జాన్వీ కపూర్‌కు కూడా ఆ రకమైన పవర్ ఫుల్ ప్యాకేజ్ ఉందనేది ఫిల్మ్ నగర్ విశ్లేషకుల అభిప్రాయం. మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే గ్లామర్, కిల్లర్ లుక్స్ ఆమెకు దండిగా ఉన్నాయి. అయితే జాన్వీని కేవలం డాన్స్, గ్లామర్‌కే పరిమితం చేయడం ఆమె ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించే విషయమే అయినా... కమర్షియల్ సినిమా కోణంలో చూస్తే మాత్రం స్పెషల్ నంబర్స్ ద్వారానే ఆమె ఎక్కువ మైలేజ్ సాధిస్తోందనడంలో సందేహం లేదు. మ‌రి రాబోయే రోజుల్లో అయినా ఆమె తన నటనతో ఈ టాక్‌ను మార్చేస్తుందో లేక స్పెషల్ క్వీన్‌గా సెటిల్ అవుతుందో వేచి చూడాలి.

#JanhviKapoor#devara#ntr#peddi#ramcharan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి