Allu Arjun: సినిమాలు పక్కన పెట్టి రాజకీయాలలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారా? 2028-2029 లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు.
ఆయనకి, రాజకీయాలు సెట్ కాలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు బీజేపి, టీడీపీలతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ప్రస్తుతం, ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. తమిళంలో కూడా తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రిగా సంచలనాలను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్‌టిర్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది.
దీంతో, ఆయన ఆఫీస్ నుంచి అఫీషియల్‌గా ఒక నోట్ విడుదల చేసి, ఆ వార్తలన్నీ అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు, అల్లు అర్జున్ గురించి ఇలాంటి ప్రచారాలే జరుగుతున్నాయి. పుష్ప ఫ్రాంఛైజీస్ తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ తాను చేస్తున్న సినిమాలను పక్కన పెట్టి, త్వరలో రాజకీయ రంగప్రేవేశం చేయబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
దీనితో, అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ కి అలాంటి ఆలోచనలేవీ లేవని, ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలు పక్కన పెట్టి రాజకీయాలలోకి రావడం ఇప్పట్లో జరగనిపని. ఇప్పుడు, సోషల్ మీడియాలో వస్తునవన్నీ నిరాధారమైనవి..అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో, అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై వస్తునవన్నీ కంప్లీట్ గా ఫేక్ అని తేలిపోయింది.












