National

Dharmendra Pradhan: మంత్రి రాజీనామా డిమాండ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!..

రచన: Venu3 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహానికి కారణమైన NEET పేపర్ లీక్ వివాదం.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికే పెద్ద సవాల్‌గా మారింది. ఈ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు, ఫలితాల్లో అవకతవకలు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహానికి కారణమైన NEET పేపర్ లీక్ వివాదం.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికే పెద్ద సవాల్‌గా మారింది. ఈ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు, ఫలితాల్లో అవకతవకలు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఇదే సమయంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ, Gen-Z డిమాండ్ చేశాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి నిరసనలు కొనసాగాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో చర్చించిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు.. ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లను సమర్పించారు.

ఇందులో భాగంగా మొదటి డిమాండ్-కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. రెండోది.. NEET వివాదంతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని.. మూడోది.. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని.. అయితే ఈ మూడు డిమాండ్లలో మంత్రి రాజీనామా డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రజలు తమకు అధికారం అప్పగించారని, ప్రజా తీర్పును గౌరవిస్తూ తమ బాధ్యతలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

సమస్యకు పరిష్కారం మంత్రి మార్పులో లేదని, పరీక్షా విధానాల్లో సంస్కరణలు తీసుకురావడం, పేపర్ లీక్ వెనుక ఉన్న వ్యక్తులు, వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పింది.. మరోవైపు మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు విరమించేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేస్తోంది. దీంతో ఒకవైపు కేంద్రం వెనక్కి తగ్గేది లేదంటుంగా నిరసనకారులు తమ డిమాండ్‌పై పట్టుబడుతున్నారు..

#National#Dharmendra Pradhan#Union Education Minister#resignation#bjp#Cockroach Janata Party
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి