Ajay Bhupathi: దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద ఒక్క సినిమాకి పని చేసినా చాలు..వాళ్ళలో మంచి క్రియేటివిటీ వచ్చేస్తుంది. ముంబైలో మాత్రమే కాదు, హైదరాబాద్ లోనూ ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన స్టార్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. పూరి జగన్నాధ్, కృష్ణవంశీ, శివ నాగేశ్వరరావు, హరీష్ శంకర్, తేజ..ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీరిలో అజయ్ భూపతి ఒకరు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న అజయ్ భూపతి..ఈ సినిమాతో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లను హీరోహీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వీరికి మంచి క్రేజ్ వచ్చింది. అజయ్ భూపతి దర్శకుడిగా మహా సముద్రం తీసి ఊహించని ఫ్లాప్ చూశాడు. దీని తర్వాత మంగళవారం సినిమాతో వచ్చి మళ్ళీ మంచి హిట్ అందుకున్నాడు.
ఇప్పుడు, ఈ దర్శకుడి నుంచి 'శ్రీనివాస మంగాపురం' అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నాడు. అంతేకాదు, ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ నటి రవీనా టాండన్ డాటర్ రషా తడానీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇక, సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'వెంకటప్పయ్య నాయుడు' అనే ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.
త్వరలో, ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పాయల్ తో అజయ్ భూపతి తీసిన మంగళవారం సినిమాకి పార్ట్ 2 ఉంటుందని, సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా మంగళవారం 2 అద్భుతమైన క్యారెక్టర్స్ తో ఉంటుందని వెల్లడించాడు. దీంతో, సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కన్‌ఫర్మ్ అయింది. 'శ్రీనివాస మంగాపురం' రిలీజ్ తర్వాత ఈ సినిమాకి సంబందించిన అప్‌డేట్ ఇవ్వనున్నాడు అజయ్ భూపతి. అంతేకాదు, ఆల్రెడీ లైన్ నచ్చి కొరటాల శివ నిర్మాతగా ముందుకు వచ్చాడట. మరి, ఈ క్రేజీ కాంబో మూవీ అప్‌డేట్ ఎప్పుడు రానుందో.












