Varun Tej: మన హీరోలకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ప్రతీ పదేళ్ళకి ఒక జానర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకి కాసుల వర్షం కురిపుస్తుంటింది. అందుకే, దాదాపుగా మన హీరోలందరూ ఒకే తరహా జానర్ సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తూ నిర్మాతలకి డబ్బులు తెచ్చిపెడుతుంటారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అవార్డులు, రివార్డులు అందుకున్నాయి.
అయితే, హింస-రక్తపాతం ఉంటే 18 ఏళ్లు మించినవారినే థియేటర్స్ కి అనుమతిస్తారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు అయితే అందరూ చూస్తారు. ఇక, కామెడీ జానర్ సినిమాలైతే అన్నీ వయసు వారూ చూస్తారు. హీరోలకి మంచి క్రేజ్ ఉంటుంది. కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వాలే గానీ కామెడీ జానర్ అంత సేఫ్ మరోటి ఉండదు. భారీ బడ్జెట్ అవసరం ఉండదు. పెద్ద పెద్ద సెట్స్ వేసే పని ఉండదు.
అప్పట్లో, జంధ్యాల..ఆ తర్వాత ఈవీవీ, ఇప్పుడు అనిల్ రావిపూడి..వరుసగా కామెడీ జానర్ తోనే హీరోలకి సూపర్ హిట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా, మెగా హీరోల కామెడీ టైమింగ్ కి పెట్టింది పేరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ..ఇలా వీరు చేసే కామెడీతో థియేటర్స్ దద్దరిల్లిపోతుంటాయి. అందుకే, మెగా హీరోలు చేసినన్నీ కామెడీ సినిమాలు మరో హీరో చేయలేదు.
ఇదే, వరుసలో ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా కామెడీ జానర్ మూవీనే చేస్తున్నాడు. అదే, కొరియన్ కనకరాజు. ఈ మూవీలో ఫుల్ ఫన్ ఉంటుందట. వరుణ్ తేజ్..ఫిదా, ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సినిమాలతో అదరగొట్టాడు. వాటికి మించి త్వరలో రాబోతున్న కొరియన్ కనకరాజు సినిమా ఉంటుందని తెలుస్తోంది. చూడాలి, మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో.












