సినిమా

Korean Kanakaraju: మంచి కథ, సినిమా కోసమే రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నా..

రచన: Anshu3 నిమిషాల పఠనం

Korean Kanakaraju: మంచి కథ, సినిమా కోసమే రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నానని అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ మెగా హీరో నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. ఆగస్టు 7వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

వరుణ్ తేజ్, ఎఫ్ 3 లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ హిట్ చూడలేదు. మధ్యలో, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు చేసినప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలాయి. దాంతో, మంచి కథ కోసం అన్వేషించాడు. దీనిలో, భాగంగా తన వద్దకి వచ్చిన కథే కొరియన్ కనకరాజు.

ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం అనంతపురం, రాయలసీమ యాసను నేచుకున్నాడు. కొరియన్ భాషలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ చెప్పినప్పుడు వరుణ్ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఇండో- కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంగా గాంధీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అని వరుణ్ తేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఇక, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఫిజికల్ గా పెద్ద కష్టం కాకపోయినా, డాన్స్..లుక్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు వరుణ్. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. నైజాం, వైజాగ్ లలో ఎస్విసీ ద్వారా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నాడు.

#koreankanakaraju#varuntej#rithikanayak#merlapakagandhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి