క్రైమ్

Uday Krishna Reddy: ఎట్టకేలకు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మెడికల్ రిపోర్టులో సంచలన విషయాలు

రచన: NK5 నిమిషాల పఠనం

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో కొన్ని రోజులుగా కనిపించకుండాపోయిన ఉదయ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరికి మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ అత్తాపూర్ లో ఆయనపై కేసు నమోదు కావడంతో అత్తాపూర్ కు తరలిస్తున్నారు.

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో కొన్ని రోజులుగా కనిపించకుండాపోయిన ఉదయ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరికి మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ అత్తాపూర్ లో ఆయనపై కేసు నమోదు కావడంతో అత్తాపూర్ కు తరలిస్తున్నారు.

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడెమీలో లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ అకాడెమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించారని తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించారు. ఉదయ్ పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జూలై 18న కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు పోలీసులు. దర్యాఫ్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నించారు. అయితే, ఉదయ్ అందుబాటులోకి రాలేదు. సడెన్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడు పారిపోయాడు అంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు ఉదయ్ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.

కాగా, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఉదయ్ ఖండించాడు. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఆరోపణల్లో అందులో నిజం లేదన్నాడు. అంతేకాదు తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పాడు. నానమ్మకు ఆరోగ్యం బాగోలేక సొంత ఊరుకి వెళ్లినట్ల తెలిపాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. పోలీసుల విచారణకు సహకరిస్తానన్న ఉదయ్.. చట్టం మీద తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు.

మెడికల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు..

ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం సైతం చోటు చేసుకుంది. బాధితురాలి మెడికల్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదైన రోజునే బాధితురాలికి డాక్టర్లు మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఆమె మెడపై గాయాలు గుర్తించారు. గొంతు నులిమినట్లు ఆనవాళ్లు గుర్తించారు. బాధితురాలి చెంప భాగంలో కమిలిన గాయాలను కొనుగొన్నారు. అలాగే ఎడమ కాలికి దెబ్బలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో డీసీపీ లావణ్య, చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు. అనంతరం ఉప్పర్ పల్లి కోర్టులో అతడిని హాజరుపరచనున్నారు.

#Uday Krishna Reddy#Trainee IPS#Harassment#IPS Trainee#Sardar Vallabhai Police Academy#Hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి