Coloured Papads: కలర్ పాపడ్.. అదేనండి.. కృత్రిమ రంగులతో చేసిన పాపడాలు. వీటిపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కలర్ పాపడ్స్ పై నిషేధం విధించింది. రంగుల పాపడాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు వాటిని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది అని ఆరా తీస్తే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కృతిమ రంగులతో తయారు చేసే పాపడాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సింథటిక్ కలర్స్ వాడటం వల్ల పాపడాలు జీర్ణం కావని, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇక, పిల్లల్లో అటెన్షన్ డిఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వచ్చే రిస్క్ ఉందని కూడా హెచ్చరించారు.
తమిళనాడు ప్రభుత్వం రంగుల పాపడాలు (ఫ్రైమ్స్/కచ్రీ) అమ్మకాలపై నిషేధం విధించడానికి ప్రధాన కారణం.. వీటి తయారీలో ఆరోగ్యానికి హానికరమైన కృత్రిమ రంగులను వాడుతున్నట్లు రాష్ట్ర ఆహార భద్రతా శాఖ జరిపిన విచారణలో తేలడమే. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి ఇవి ముప్పు కలిగిస్తాయని ఆ శాఖ పేర్కొంది.
పాపడ్‌లు కొనేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
రంగుల పాపడ్‌లకు బదులుగా ఏ ఆరోగ్యకరమైన స్నాక్స్ తినొచ్చు?
రంగురంగుల పాపడ్లు..
వీటిని మైదా, బంగాళదుంపలు, సగ్గుబియ్యం, బియ్యం లేదా ఇతర పిండి పదార్థాలతో తయారు చేస్తారు.
ఇవి ఆకర్షణీయంగా కనిపించడానికి వివిధ రంగులను కలుపుతారు.
వేయించినప్పుడు ఇవి ఉబ్బి, కరకరలాడుతూ, రంగురంగులుగా కనిపిస్తాయి.
సాధారణ పాపడ్‌లు..
వీటిని మినప పిండి, పెసర పిండి, బియ్యం లేదా ఇతర పప్పుధాన్యాలు, మసాలాలు, ఉప్పుతో తయారు చేస్తారు.
వీటికి సాధారణంగా కృత్రిమ రంగులు కలపరు.
వీటిని వేయించుకుని, అలాగే కాల్చుకుని కూడా తినొచ్చు.
తమిళనాడు ప్రభుత్వం రంగుల పాపడ్ల అమ్మకాలపై ఎందుకు నిషేధం విధించింది?
తమిళనాడు ప్రభుత్వం రంగుల పాపడాలపై నిషేధాన్ని విధించడానికి కారణాలు:
వాటి తయారీలో కృత్రిమ రంగులను ఉపయోగిస్తున్నారు.
ఈ రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరం.
ఇవి ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తాయి.
ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం రాష్ట్ర బాధ్యత.
తమిళనాడు ఆహార భద్రతా విభాగం జరిపిన దర్యాప్తులో, కొన్ని రంగుల పాపడ్‌లలో సింథటిక్ ఆహార రంగులను ఉపయోగించినట్లు వెల్లడైంది. FSSAI నిబంధనల ప్రకారం ఇవి అనుమతించబడవు. కృత్రిమ రంగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల కారణంగా అధికారులు ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా నిషేధించారు.
దీనికి ముందు, ఆహార పదార్థాలలో కలిపే సింథటిక్ ఫ్లేవర్లు, రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని అనేక ఆరోగ్య అధ్యయనాలు, పరిశోధనలు, దర్యాప్తులు పదేపదే పేర్కొన్నాయి. FSSAI కూడా దీనికి ప్రమాణాలను నిర్దేశించి, కొన్ని సింథటిక్ రంగులను నిషేధించింది. అవి ఇవే..
మెటానిల్ ఎల్లో
రోడమైన్-బి
ఆరెంజ్-జి
మలాచిట్ గ్రీన్
సుడాన్ డై
లీడ్ క్రోమేట్
ఇతర పరిశ్రమల, టెక్స్ టైల్ డైలు..
కృత్రిమ ఆహార రంగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు..
అలర్జిక్ రియాక్షన్లు
స్కిన్ ర్యాషెస్
కడుపు నొప్పి
వాంతులు, డయేరియా
తలనొప్పి..
లివర్ డ్యామేజ్
కిడ్నీ డ్యామేజ్
క్యాన్సర్ బారిన పడే ప్రమాదం












