తెలంగాణ

Cm Revanth Reddy: హైడ్రాను మరింత పటిష్టం చేస్తాం.. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు- హైకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రియాక్షన్

రచన: NK5 నిమిషాల పఠనం

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే హైడ్రా కమిషనర్ గా ఏవీ రంగనాథ్ ను తప్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రియాక్ట్ అయ్యారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని రేవంత్ స్పష్టం చేశారు.

Cm Revanth Reddy: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే హైడ్రా కమిషనర్ గా ఏవీ రంగనాథ్ ను తప్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రియాక్ట్ అయ్యారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని రేవంత్ స్పష్టం చేశారు.

హైడ్రా..మా ప్రభుత్వం తెచ్చిన గొప్ప సంస్కరణ..

హైడ్రా.. మా ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద, గొప్ప సంస్కరణ అని రేవంత్ చెప్పారు. ఏవీ రంగనాథ్ పై 60కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని న్యాయస్థానం సీరియస్ కావడంపైనా రేవంత్ రియాక్ట్ అయ్యారు. గతంలో సోమేశ్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. తప్పుడు కేసులపై న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామన్నారు రేవంత్ రెడ్డి.

కబ్జాదారులు కోర్టును తప్పు దారి పట్టించారు...

''భూకబ్జాదారులు కోర్టును తప్పు దారి పట్టించారు. హైడ్రా కార్యాచరణపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. హైకోర్టు ఆర్డర్స్ పరిశీలించిన తర్వాత మళ్లీ స్పందిస్తా. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే హైడ్రా చర్యలను కొనసాగిస్తాం. హైడ్రా మంచి పనులు చేస్తోంది. కోర్టు కేసులు ఎదుర్కొంటాం. చెరువులు కబ్జాకు గురి కాకుండా పరిరక్షిస్తాం. వచ్చే రోజుల్లో హైడ్రాను మరింత పటిష్టం చేస్తాం. హైడ్రా పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. పేదలు పెద్దలు ఎవరి విషయంలోనైనా హైడ్రా ఒకే విధంగా స్పందిస్తుంది. బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు. వందల ఎకరాలు కబ్జా చేసిన ముఖీమ్ ను హైడ్రా ఖాళీ చేయించింది'' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సోమేశ్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులు..

''చెరువులు, నాలాలను, ప్రభుత్వ భూములను, పార్కులను కబ్జా చేసే కబ్జాకోరులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేశ్ కుమార్ పై 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ మాట్లాడలేదు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలి అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పుడు కేసులను కోర్టుల్లో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తోంది. మేము చెరువులు, నాలాలు పరిరక్షించాం. హైడ్రాతో మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. హైడ్రాను మరింత బలోపేతం చేస్తాం'' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా, లోతుకుంట భూముల విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై సీరియస్ అయ్యింది. రంగనాథ్ పై 60కిపైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉండటం ఏంటని ప్రశ్నించింది. ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. వెంటనే హైడ్రా కమిషనర్ గా ఏవీ రంగనాథ్ ను తప్పించి ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలంటూ సీఎస్ కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది.

#Cm Revanth Reddy#Hydraa#Telangana High Court#AV Ranganath#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి