International

Skin Cancer: ప్రాణం తీసిన చిన్న మచ్చ.. నిర్లక్ష్యం చేయడంతో యువతి మృతి.. బీకేర్ ఫుల్

రచన: NK6 నిమిషాల పఠనం

Skin Cancer: శరీరంలో కనిపించే మార్పుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. అది చిన్న మార్పు కావొచ్చు, పెద్ద మార్పు కావొచ్చు.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. నుదుటిపై ఏర్పడిన చిన్న మచ్చ.. ఓ యువతి ప్రాణం తీసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

Skin Cancer: శరీరంలో కనిపించే మార్పుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. అది చిన్న మార్పు కావొచ్చు, పెద్ద మార్పు కావొచ్చు.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. నుదుటిపై ఏర్పడిన చిన్న మచ్చ.. ఓ యువతి ప్రాణం తీసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నపాటి మచ్చ ఓ యువతి నిండు ప్రాణాన్ని తీసింది. అసలేం జరిగిందంటే.. ఆమె పేరు అలోండ్రా సియర్రా. వయసు 26 ఏళ్లు. 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెకు నుదుటి మీద మచ్చ ఏర్పడింది. అయితే, ఆ యువతి దాన్ని పట్టించుకోలేదు. చిన్న మచ్చనే కదా.. అదే పోతుందిలే అని లైట్ తీసుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేసింది.

అయితే, ఆ చిన్న మచ్చ తీవ్ర రూపం దాల్చింది. మూడేళ్ల తర్వాత భయంకరమైన విషయం బయటపడింది. అది క్యాన్సర్ అని తెలిసింది. దాంతో యువతి నిర్ఘాంతపోయింది. క్యాన్సర్ అని గుర్తించినా.. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. క్యాన్సర్ ముదిరిపోయింది. శరీరమంతా వ్యాపించింది. అది చర్మ క్యాన్సర్ మెలనోమా అని డాక్టర్లు గుర్తించారు. చివరికి ఈ క్యాన్సర్ కారణంగా యువతి చనిపోయింది.

శరీరంలో కానీ, చర్మంపైన కానీ కనిపించే ఎలాంటి మార్పు అయినా చిన్నదైనా పెద్దదైనా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆ మార్పులు ఎంత చిన్నవిగా అనిపించినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా.. సమయానికి డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. వెంటనే డాక్టర్లను కలవడం ద్వారా జబ్బుని గుర్తించి నయం చేసుకోవచ్చని, తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

వీడియోల రూపంలో అవగాహన కార్యక్రమాలు..

తనకు ఎదురైన పరిస్థితి మరొకరికి ఎదురు కాకుడదని సియర్రా తన వంతు ప్రయత్నం చేసింది. కొన్నేళ్లుగా చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించింది. స్టేజ్ 4 మెలనోమాతో బాధపడిన ఆమె సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించింది. సియర్రా ప్రముఖ టిక్‌టాక్ క్రియేటర్. చర్మ క్యాన్సర్ అవగాహన ప్రచారకర్త కూడా. మరణానికి ముందు అలోండ్రా సియెర్రా చర్మంలో వచ్చే మార్పులు ఎంత చిన్నవిగా కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కోరుతూ చివరి సందేశాన్ని పంచుకున్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం ఎంత కీలకమైన మార్పు తీసుకురాగలదో వివరించింది.

చిన్న మచ్చతో మొదలైంది..

అప్పుడు నా వయసు 19 ఏళ్లు. నుదుటిపై చిన్న మచ్చ ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఆ మచ్చ లేత రంగు నుండి ముదురు రంగులోకి మారింది. అది క్యాన్సర్ కావచ్చని నేను అస్సలు ఊహించలేదు. నాకు 'మెలనోమా' (ఒక రకమైన చర్మ క్యాన్సర్) వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా నా మనసులోకి రాలేదు. నాకు మెలనోమా ఉన్నట్లు నిర్ధారణ కావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. అది గుర్తించే సరికి ఆ వ్యాధి బాగా ముదిరిపోయింది.

అనేక శస్త్రచికిత్సలు, ఇమ్యునోథెరపీ, రేడియేషన్, ఇతర చికిత్సలు చేయించుకున్నప్పటికీ క్యాన్సర్ ముదిరిపోతూనే ఉంది. 2024లో నా పుర్రె, వెన్నెముక, కటి, పక్కటెముకలు, వీపు, కడుపుతో సహా శరీరం అంతటా మెలనోమా వ్యాపించింది. ఇమ్యునోథెరపీ ప్రారంభించా. కానీ చికిత్స విజయవంతం కాలేదు. జూన్‌లో మెదడుకు చేరిన క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి డాక్టర్లు రేడియేషన్ థెరపీని ప్రారంభించారు'' అని తాను బతికున్న సమయంలో సియర్రా తెలిపింది.

గత నాలుగు సంవత్సరాలుగా సోషల్ మీడియా ద్వారా మెలనోమా, సూర్యరశ్మి నుండి రక్షణ, క్రమం తప్పని చర్మ పరీక్షల ప్రాముఖ్యత గురించి ఇతరులకు అవగాహన కల్పించింది సియర్రా. హానికరమైన UV కిరణాల బారి నుండి రక్షించుకోవాలంది. అదే సమయంలో నివారణ చర్యలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తన వీడియోల ద్వారా ఆమె తెలియజేసింది.

#Skin Cancer#US#Alondra Sierra#Freckle#Melanoma#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి