తెలంగాణ

malkajgiri: దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ.. హృదయాలను గెలుచుకున్న మానవత్వం!

రచన: Venu4 నిమిషాల పఠనం

పోలీసుల బాధ్యత కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాదు.. అవసరమైన చోట మానవత్వాన్ని చూపించడం కూడా అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇలాంటి చిన్న చిన్న ప్రోత్సాహాలు.. ఎంతోమంది దివ్యాంగులకు పెద్ద పెద్ద కలలు కనేందుకు ధైర్యాన్ని ఇస్తాయి.

శరీరానికి పరిమితులు ఉండొచ్చు... కానీ కలలకు మాత్రం ఎలాంటి పరిమితులు ఉండవు.. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ఇది అక్షర సత్యం.. వారి శరీరంలోని లోపాలు వారి ఆశలకు శాపంగా మారవచ్చు కానీ వారి కలలకు మాత్రం కాదని ఎన్నో సంఘటనలు నిరూపించాయి.

ఇక ఇలాంటి వారిలో కొందరికి ఉండే ఆత్మవిశ్వాసానికి ఎలాంటి హద్దులు ఉండవు. అలాంటి వారికి కావాల్సింది జాలి కాదు... అవకాశం, ప్రోత్సాహం, నమ్మకం... ఒక్క మంచి మాట.. ఒక్క చిన్న ప్రోత్సాహం.. వారి జీవితంలో ఎన్నో ఆశలకు వెలుగు నింపగలదు. అలాంటి హృదయాన్ని హత్తుకునే సంఘటనే మల్కాజిగిరి కమిషనరేట్‌లో చోటుచేసుకుంది.

పోలీస్ ఆఫీసర్ కావాలనే చిరకాల కలతో ఉన్న దివ్యాంగ యువకుడు రాహుల్‌ జీవితంలో చిరస్మరణీయమైన రోజును సీపీ సుమతి సృష్టించారు. రాహుల్‌ను ప్రత్యేకంగా మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయానికి ఆహ్వానించిన సీపీ సుమతి.. అతనిని తన అధికారిక కుర్చీలో కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్‌ను స్వయంగా ధరింపజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇది ఒక సాధారణ కార్యక్రమంలా కనిపించినా.. రాహుల్‌కు అది జీవితాంతం మరచిపోలేని అనుభూతి అని చెప్పవచ్చు. తన కల ఒక్క క్షణంలో నిజం అయ్యింది.. అనే భావనతో అతని కళ్లలో మెరిసిన ఆనందం.. అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.

రాహుల్‌కే కాదు.. అతని కుటుంబ సభ్యులకు కూడా అపారమైన సంతోషాన్ని అందించారు సీపీ సుమతి. దివ్యాంగుల కలలను గౌరవిస్తూ.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.

మరోవైపు పోలీసుల బాధ్యత కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాదు... అవసరమైన చోట మానవత్వాన్ని చూపించడం కూడా అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇలాంటి చిన్న చిన్న ప్రోత్సాహాలు... ఎంతోమంది దివ్యాంగులకు పెద్ద పెద్ద కలలు కనేందుకు ధైర్యాన్ని ఇస్తాయి. ఒకరి కలను నిజం చేయడానికి మనం చేసే చిన్న ప్రయత్నం... వారి జీవితంలో అతిపెద్ద విజయంగా మారవచ్చు.

#Telangana#Hyderabad#malkajgiri#cp sumathi#abled persons#dream#true
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి