National

Floods : అస్సాంలో జలవిలయం.. 66 మంది దుర్మరణం

రచన: Kumar3 నిమిషాల పఠనం

భారీ వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. జలప్రళయం సంభవించడంతో జనజీవనం స్తంభించిపోయింది.ఎడతెరపి లేకుండా వర్షాల కారణంగా నదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 631 గ్రామాలు నీట మునిగాయి.

భారీ వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. జలప్రళయం సంభవించడంతో జనజీవనం స్తంభించిపోయింది.ఎడతెరపి లేకుండా వర్షాల కారణంగా నదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 631 గ్రామాలు నీట మునిగాయి. అటు కేంద్రరాష్ట్ర బృందాలు అస్సాంలో సహాయక చర్యలు చేపట్టాయి. చాలా వరకు గ్రామాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.

రోడ్లు, వంతెనలు, బ్రిడ్జిలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు, హెలికాప్టర్ సాయం తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోవడంతో పాటు సర్వస్వం కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తమ బంధువులు, కుటుంబీకులు కనిపించకుండా పోయారని, వారిని కనిపెట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.

అయతే, వరదలు ఉప్పొంగడంతో 631 గ్రామాలు నీట మునిగినట్టు అధికారులు తెలిపారు. ఈ వరద ఉధృతికి శివసాగర్, గోలాఘాట్, చరైదేవ్, జొర్హాట్, నాగావ్, కామరూప్ జిల్లాల్లో 4.45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చరైదేవ్ జిల్లాలో అత్యధిక 1.88 లక్షల మంది ప్రభావితం కాగా శివసాగర్ జిల్లాలో 1.44 లక్షల మంది నిరాశ్రయులైనట్టు తెలిసింది. ఈ వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకూ 66 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

https://x.com/pulsenewsbreak/status/2082019586216694177?s=20

#floods#assam#66 people dead#heavy rains
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి