సినిమా

Bhagyashr Borse: మా అమ్మేనన్ను బ్లాక్ చేసింది..!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Bhagyashr Borse: ఇటీవల లెనిన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది పొడుగు కాళ్ళ సుందరి భాగ్యశ్రీ బోర్సే. తాజాగా, ఈ బ్యూటీ వాళ్ల అమ్మ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నార్త్ నుంచి అమ్మాయిలను అమ్మా, నాన్నలే మోడలింగ్ రంగంలోకి గానీ, సినిమా రంగంలోకి గానీ వెళ్ళమని ఎంకరేజ్ చేస్తుంటారు.

Bhagyashr Borse: ఇటీవల లెనిన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది పొడుగు కాళ్ళ సుందరి భాగ్యశ్రీ బోర్సే. తాజాగా, ఈ బ్యూటీ వాళ్ల అమ్మ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నార్త్ నుంచి అమ్మాయిలను అమ్మా, నాన్నలే మోడలింగ్ రంగంలోకి గానీ, సినిమా రంగంలోకి గానీ వెళ్ళమని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ, భాగ్యశ్రీ విషయంలో ఇది పూర్తిగా భిన్నం అని ఓపెన్ అయింది.

పూణె నగరానికి చెందిన భాగ్యశ్రీ బోర్సే, మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2023 లో వచ్చిన యారియాన్ 2 తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భాగ్యశ్రీని చూసిన టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా ఫ్లాపైనా, అమ్మడి అందానికి, పర్ఫార్మెన్స్ కి మరిన్ని అవకాశాలు వచ్చి పడ్డాయి.

కాంత, ఆంధ్రాకింగ్ తాలూకా, కింగ్‌డం సినిమాలలో నటించింది. ఈ సినిమాలేవీ భాగ్యశ్రీని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేదు. శ్రీలీల తప్పుకోవడంతో వచ్చిన లెనిన్ సినిమా మొదటి హిట్ గా నిలిచింది. అఖిల్ సరసన నటించిన భాగ్యశ్రీ డీసెంట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు, ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలను అందుకునేలా ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే, తాజాగా భాగ్యశ్రీ.. తన కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

కెరీర్ ప్రారంభంలో నటన మీద ఆసక్తి ఉందని, సినిమాల్లోకి వెళతానని ముందుగా అమ్మకి చెప్పిందట. దానికి, ఆమె సేసేమిరా అనడంతో, తన తండ్రిని అడిగిందట. ఆయన కూడా.. అమ్మ వద్దని చెప్పింది కదా..అని బదులిచ్చాడట. చివరిగా తన సోదరిని అడిగితే ఆమె కూడా.. అమ్మా నాన్నలు వద్దన్నప్పుడు ఎందుకు నీకు సినిమాలు..అంటూ సమాధానం ఇచ్చిందట. మొదటి సినిమాలో ఛాన్స్ వచ్చాక, 6 నెలలు పాటు భాగ్యశ్రీని వాళ్ళ అమ్మ వాట్సాప్ లో బ్లాక్ చేసిందట. తాజాగా, ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు, ఆ విషయం తలుచుకుంటే నవ్వొస్తుంది గానీ, అప్పుడు మాత్రం చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం, ఈ విషయమై సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది.

#bhagyashrborse#lenin#akhil#harishshankar#raviteja
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి