Allu Arjun: సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసే వారి గురించి, ట్రోల్స్ చేసే వారి గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. అసలు అల్లు అర్జున్ ఎందుకింతగా రియాక్ట్ అయ్యాడు..ఎవరికి ఈ స్ట్రాంగ్ కౌంటర్ అనేది వివరాల్లోకి వెళ్ళి చూద్దాం.
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవడంతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమకి నచ్చని వాళ్ళ గురించి రక రకాలుగా కామెంట్స్ పెట్టడం, దానికి రిప్లయ్ ఇచ్చేవాళ్ళు అంతకంతా ఉన్నారు. ట్రోలర్స్ మరో రకం. సినిమాలలోని క్లిప్పింగ్స్ కి రక రకాల ఏమోజీలను జత చేసి వీడియోలను వదులుతున్నారు. దీని, వల్ల కొన్నిసార్లు చాలానే డ్యామేజ్ అవుతోంది. ఇక, స్టార్స్ గురించి వచ్చే నెగిటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే, ఈ నెగిటివిటీని క్రియేట్ చేస్తున్న వారిని ఉద్దేశించి అల్లు అర్జున్ తాజాగా మాట్లాడారు. ఓ హోటల్ లో తన అభిమానులను కలిశారు. వారితో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీలో ఈ ఉత్సాహాన్ని ఎప్పటికీ పోనీయకండి..ఈ రోజు నేను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నన్ను అభిమానించేవాళ్ళకు, నన్ను ద్వేషించే వారికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
మనకి నచ్చని వాల్ల గురించి డబ్బు ఖర్చు చేస్తామా..లేదు కదా..మనకు నచ్చని వాళ్ళ గురించి మన డబ్బు, సమయం వృధా చేయడం కంటే ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదలకి ఉపయోగించండి అని చెప్పుకొచ్చారు. ఒక హీరో అభిమానులు మరో హీరో గురించి తప్పుగా మాట్లాడటం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలిపారు. ట్రోలర్స్, మీమ్స్ చేసేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బన్నీ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
ప్రస్తుతం, అల్లు అర్జున్ మాట్లాడిన ఈ మాటలు అటు ఫిల్మ్ సర్కిల్‌లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా చిత్రాన్ని చేస్తున్నాడు బన్నీ. ప్రస్తుత, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపిక పడుకొన్ హీరోయిన్‌గా నటిస్తుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.












