National

Kiran Bedi: మహిళలకు పెళ్లి ఓ ట్రామా.. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

భారతీయ వివాహ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, సామాజిక అంచనాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో పాల్గొన్న ఆమె... పెళ్లి అనేది మహిళల జీవితంలో కేవలం ఒక సంబరం కాదని, అదొక పెద్ద మానసిక వేదన అని పేర్కొన్నారు.

భారతీయ వివాహ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, సామాజిక అంచనాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో పాల్గొన్న ఆమె... పెళ్లి అనేది మహిళల జీవితంలో కేవలం ఒక సంబరం కాదని, అదొక పెద్ద మానసిక వేదన అని పేర్కొన్నారు.

పైకి కంటికి ఇంపుగా, కోలాహలంగా కనిపించే వేడుకల వెనుక... ఏళ్లుగా పెరిగిన సొంత ఇంటిని, కన్నవారిని వదిలి గుర్తుతెలియని కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టే సమయంలో స్త్రీలు పొందే భావోద్వేగ సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. అత్తవారింటికి కోడలిగా వెళ్లిన మరుక్షణమే ఆ మహిళపై సమాజం అపరిమితమైన నిబంధనలు, అంచనాలను రుద్దుతుందని కిరణ్ బేడీ ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత ఆశయాలు, ఇష్టాయిష్టాలను పూర్తిగా పక్కనబెట్టి అత్తమామలను సొంత కన్నవారిలా ఆదరించాలని, కుటుంబ బాధ్యతలనే సర్వస్వంగా భావించాలని సమాజం ఆశిస్తుందని అన్నారు. అయితే ఈ తరహా అంచనాలపై వివాహ బంధంలోకి అడుగుపెట్టక ముందే వధూవరులిద్దరూ స్పష్టమైన చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

పెళ్లి తర్వాత కూడా తమ ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తామని, ఇంటి పనుల్లో భర్త సమాన భాగస్వామ్యం వహించాలని లేదా పనిమనుషుల సహాయం తీసుకుంటామని మహిళలు ముందే తెగేసి చెప్పాలని సూచించారు. వివాహం, పిల్లల పెంపకం నెపంతో అనేక మంది మహిళలు తమ వృత్తి ఉద్యోగాలకు దూరమవుతుండటంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మగవారు పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌ను యథాతథంగా కొనసాగిస్తుంటే, స్త్రీలు మాత్రం తమ భవిష్యత్తును త్యాగం చేయాల్సి వస్తోందని.. ఇది మహిళా కార్మిక శక్తి క్రమంగా తగ్గిపోవడానికి కారణమవుతోందని విశ్లేషించారు.

సమానత్వం లేని కుటుంబ వ్యవస్థ వల్ల మహిళలు తమ గుర్తింపును కోల్పోతున్నారని ఆమె స్పష్టం చేశారు. అత్తగారింట్లో సరైన గౌరవం, ఆదరణ, భావోద్వేగ మద్దతు లభించనప్పుడు మహిళలు రాజీపడాల్సిన అవసరం లేదని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటూ, ధైర్యంగా పుట్టింటికి తిరిగి వచ్చే నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడకూడదని ఆమె పిలుపునిచ్చారు. అదే సమయంలో, అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే మహిళలను సమాజం వేలెత్తి చూపకుండా, సానుభూతితో, సానుకూల కోణంలో అర్థం చేసుకునే పరిణతి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

 

#Kiran Bedi#Marriage Trauma#Indian Women Issues#Marriage Expectations#Womens Mental Health#Career After Marriage
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి