Karti 30: ప్రస్తుతం, ఇటు తెలుగులో అటు తమిళంలో క్రేజ్ ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. తమిళంలో నటించిన గోట్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో, ప్రస్తుత సీఎం విజయ్ తపలపతి హీరోగా నటించాడు. ఇక, ఇటీవల వచ్చిన సినిమాలన్నిటితోనూ మీనూ సూపర్ హిట్స్ అందుకుంది. తెలుగులో, వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం చేసింది. అనిల్ రావిపూడి దర్శకుడు.
ఇందులో, ఐశ్వర్య రాజేష్ మెయిన్ హీరోయిన్. మీనాక్షి సెకండ్ లీడ్‌లో చేసింది. కానీ, పేరొచ్చింది మాత్రం మీనూకే. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు, ఇందులో మీనూ సోలో హీరోయిన్ కాగా, మంచి పేరొచ్చింది.
ఇలా, వరుస హిట్స్ మీదున్న మీనూ, తొందరపడి మాత్రం వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు తెలుగులో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న వృష కర్మ అనే పాన్ ఇండియా సినిమా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తమిళ హీరో కార్తి నటిస్తున్న తన 30వ సినిమాలో సోలో హీరోయిన్‌గా మీనాక్షి ఎంపికైంది. ఇది గనక హిట్ అయితే, అక్కడ గుడి కట్టేయడం ఖాయం.
తెలుగులో మీనాక్షికి మరో క్రేజీ ఆఫర్స్ వచ్చినట్టు, తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో రూపొందుతున్న మెగా 158లో మీనాక్షి ఓ ఇంపార్టెంట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. చిరంజీవి సినిమా అంటే గ్యారెంటీగా మీనాక్షికి మచి రోల్ పడుతుంది. కాబట్టి, మెగా 158 కూడా కన్‌ఫర్మ్ అయితే, అటు తమిళ సినిమా, ఇటు తెలుగులో రెండు సినిమాలతో అలరించడానికి మీనూ రెడీ అవుతున్నట్టే.












