తెలంగాణ

SIR : తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్.. ఈసీ అధికారిక ప్రకటన!

రచన: Kumar••3 నిమిషాల పఠనం

ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ రాష్ట్రంలో ఎట్టకేలకు పూర్తయ్యింది. రెండు నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేయడంలో బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహించడం, ఫారమ్స్ అందలేదని పలు ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం రెండు సార్లు గడువు పొడగించగా.. నిన్నటితో తుది గడువు ముగిసింది.

ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ రాష్ట్రంలో ఎట్టకేలకు పూర్తయ్యింది. రెండు నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేయడంలో బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహించడం, ఫారమ్స్ అందలేదని పలు ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం రెండు సార్లు గడువు పొడగించగా.. నిన్నటితో తుది గడువు ముగిసింది.అయినప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారమ్స్ చాలా చోట్ల అందలేదని ఓటర్లు, తీసుకున్న వారు వివరాలు సరిగా నింపలేదని బీఎల్‌వోలు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్ మహానగరంలోనూ చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారమ్స్ తమకు అందలేదని ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి. ఇక ఫారమ్స్ అందుకున్న వారు తిరిగి బీఎల్‌వోలకు అందజేయలేదని ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలోనే ఎస్ఐఆర్‌ ప్రక్రియ పూర్తయినట్టు అధికారిక లెక్కలను ఎన్నికల సంఘం ప్రకటించింది.దీని ప్రకారం రాష్ట్రంలో సుమారు 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు అయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. 2,64,87,214 మంది ఓట్లు డిజిటలైజ్ అయినట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా 73,39,234 ఓట్లు డిలీట్ చేసినట్టు ఈసీ తెలిపింది. అందులో చనిపోయిన వారు 9,22,230 మంది ఉండగా.. ట్రేసబుల్ చేయని వారు 11,25,546 మందిని గుర్తించారు.

ఇక ప్రస్తుతం ఉన్న అడ్రసు నుంచి శాశ్వతంగా వేరే చోటుకు వెళ్లిపోయిన వారు 45,18,961 మంది ఉండగా.. ఇప్పటికే డిజిటల్ ప్రాసెస్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు 6,70,203 మంది గుర్తించారు. 1,02,294 మంది నుంచి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందలేదని రాష్ట్రఎన్నికల సంఘం ప్రకటించింది.

#Election commision#CEO. SIR#official data release#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి