ఏపీ

AP : ప్రేమపెళ్లికి గ్రీన్‌సిగ్నల్.. కాలువలో దూకి ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

సాధారణంగా ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరంచలేదని ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడం కామన్. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ, ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించినా లవర్స్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో అమ్మాయి మృతి చెందగా.. అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఏపీలోని పశ్చిమగోదావరి పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన సందీప్ కుమార్ (22) భీమవరంకు చెందిన లలితాంబికలుగా(20)లు ప్రేమించుకున్నారు. వివాహాం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని సందీప్ వారి ఇంట్లో చెప్పగా.. పెద్దలు అంగీకరించారు. అమ్మాయికి పేరెంట్స్ లేకపోవడంతో తన పెద్దమ్మ వద్దే పెరుగుతోంది. ఆమె సైతం వీరి పెళ్లికి అంగీకరించింది.

సందీప్‌కు సోదరి ఉంది. ఆమె వివాహం అయ్యాక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.భీమవరంలోని ఓ ఆక్వా షాపులో లలితాంబిక పనిచేస్తుండగా.. సందీప్ చదువును కొనసాగిస్తున్నాడు.అయితే, ఇంతలో ఏం జరిగిందో తెలీదు.. సోమవారం రాత్రి వేండ్ర గ్రామంలోని అడవికోడు లాకులు వద్ద కాలువలో దూకి ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేశారు. స్థానికులు గమనించి యువకుడిని రక్షించగా.. కాలువ ఉధృతికి లలితాంబిక గల్లంతైంది. ప్రస్తుతం భీమవరం ఆసుపత్రిలో సందీప్ చికిత్స పొందుతున్నాడు.

కాలువలో యువతి లలితాంబిక మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆస్పత్రి బెడ్ మీద సందీప్ వద్ద స్టేట్మెంట్ తీసుకోగా.. లలితాంబికకు ప్రాణాంతకమైన వ్యాధి ఉండటంతో ఇద్దరం కలిపి చనిపోదామని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.ఈ విషయం తెలిసి ఇరు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

https://x.com/TeluguScribe/status/2087075746967863456?s=20

#lovers#sucide attempt#Westgodavari#health issue#andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి