వ్యాపారం

YouTube : కంటెంట్ క్రియెటర్ల ఆదాయానికి గండి.. షాకిచ్చిన యూట్యూబ్!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది.ఓ చానెల్ క్రియేట్ చేసి వివిధ రకాల కంటెంట్ చేస్తూ డబ్బులు సంపాదించాలనుకునే వారికి యూట్యూబ్ బిగ్‌షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) రూల్స్‌ను కఠినతరం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది.ఓ చానెల్ క్రియేట్ చేసి వివిధ రకాల కంటెంట్ చేస్తూ డబ్బులు సంపాదించాలనుకునే వారికి యూట్యూబ్ బిగ్‌షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) రూల్స్‌ను కఠినతరం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. 2018 తర్వాత నిబంధనలు మార్చడం ఇదే తొలిసారి. ప్రతిరోజూ యూట్యూబ్‌ షార్ట్స్ వ్యూస్ 200 బిలియన్లు దాటడం, టీవీల్లో వ్యూస్ సమయం బిలియన్ గంటలకు పైగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సంస్థ ప్రకటించడం గమనార్హం.

తాజా రూల్స్ ప్రకారం.. యూట్యూబ్ ప్రీమియం ద్వారా ఆదాయం పొందాలనుకునే వారు గతంలో కంటే రెట్టింపు అర్హత సాధించాల్సి ఉంటుంది. అనగా పెద్ద వీడియోలు 365 రోజుల్లో 8,000 గంటల వాచ్ టైమ్ సాధించాలి. ప్రస్తుతం ఇది 4 వేల గంటలుగా ఉంది. యూట్యూబ్ షార్ట్స్ (చిన్న వీడియాలు) 90 రోజుల్లో 20 మిలియన్ల (2 కోట్లు) వ్యూస్ రాబట్టాలి.ప్రస్తుతం దీని టార్గెట్ 10 మిలియన్లు. వెయ్యి సబ్‌స్క్రైబర్ల నిబంధనలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం YPPలో ఉన్న 30 లక్షలకుపైగా క్రియేటర్లకు ఈ కొత్త ఎంట్రీ నిబంధన వర్తించదని తెలిపింది. కాగా, ఈ రూల్స్ ఫిబ్రవరి 1, 2027 నుంచి అమలులోకి రానుంది.

షార్ట్స్ (చిన్నవీడియోలకు)..

షార్ట్స్ విషయంలో మాత్రం పాత, కొత్త కంటెంట్ క్రియేటర్లు ఇద్దరినీ ప్రభావితం చేసేలా యూట్యూబ్ కొత్త రూల్ తెచ్చింది. చిన్నవీడియోలు చేసి రెగ్యులర్‌గా ప్రకటనల ఆదాయం పొందాలంటే ప్రతి మూడు నెలలు అనగా 90 రోజుల వ్యవధిలో కనీసం 10 మిలియన్ల వ్యూస్ ఉండాలి. టార్గెట్ రీచ్ కాకపోతే వచ్చే ఆదాయం తాత్కాలికంగా ఆగిపోనుంది. అయితే, ఛానెల్ YPPలోనే కొనసాగుతూ లాంగ్-ఫామ్ వీడియోల ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చని యూట్యూబ్ వెల్లడించింది. తిరిగి 10 మిలియన్ వ్యూస్ దాటిన తర్వాత షార్ట్స్ ఆదాయం మళ్లీ పునరుద్ధరిస్తామని సంస్థ ప్రకటించింది.

#Youtube#new guidlines#monitisation#content creators
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి