National

SIR : ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు గల్లంతు!

రచన: Kumar••3 నిమిషాల పఠనం

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగించినట్టు సమాచారం.ఆయనకు నాలుగు ఓట్లు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో బెంగళూరులో తన ఓటును ఎన్నికల సంఘం అధికారులు తొలగించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.

తన ఓటును ఎన్నికల సంఘం తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్ఐఆర్‌లో భాగంగా బెంగళూరు సెగ్మెంటులోదాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, అందులో తన పేరు కూడా ఉందంటూ ట్వీట్ చేశారు.తాను బెంగళూరులో పుట్టి, అక్కడే పెరిగి, విద్యాభ్యాసంతో పాటు థియేటర్ ప్రయాణం కూడా సాగించానని పేర్కొన్నారు.

అదే నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు. అయితే, ఎస్ఐఆర్‌ పేరిట తన ఓటు హక్కును తొలగించడం విడ్డూరంగా ఉందంటూ ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఈ విధంగా ఓట్లు తొలగించి మమ్మల్ని ఆపగలమని మీరు అనుకుంటున్నారా? అని కేంద్రంలోని మోడీ సర్కారును ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. ఓట్లు తొలగించినా మిమ్మల్ని అధికారం నుంచి దించేయడాన్ని ఎవరూ ఆపలేరని కామెంట్స్ చేశారు.

దీనికి తోడు జార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీకి సమీపంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న JPSC-JSSC అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. నిరసన ప్రాంతంలో టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసిన ఆయన.. ఈ రకమైన క్రూరత్వం ఇకపై చెల్లదని, ఇది అహంకారపూరిత అధికార పతనానికి దారితీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#actor prakash raj#vote delete#SIR process#banglore
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి