Khadgam: కొన్ని సినిమాలు కొందరి జీవితాలలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. ఏళ్ళ తరబడి ఆ సినిమా గురించి..ఆ దర్శకుడి గురించి అందులో నటించిన నటీటులు, కథ గమనం..ఇలా పలు విషయాలలో ఒక్క సినిమా గురించే మాట్లాడుకుంటారు. అలాంటి, అతికొద్ది సినిమాలలో కృష్ణ వంశీ రూపొందించిన ఖడ్గం సినిమా ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే.
ఆగస్టు 15, 2026న కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఖడ్గం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా, రవితేజ, బ్రహ్మాజీ, సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా పెద్ద హిట్. ఇంతవరకూ ప్రతీసారి స్మాల్ స్క్రీన్ మీద వచ్చే ఖడ్గం, ఈసారి థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుందని దర్శకుడు కృష్ణ వంశీ తెలిపాడు.

పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని, దేశ ప్రజలను ఎలా కాపాడుకోవాలి..వారు సృస్థించే మారణ హోమాన్ని ఎలా ఆపాలి..వారికి ఎలా బుద్ది చెప్పాలి..పాకిస్తాన్‌కి మన ఇండియన్ ఆర్మీ, పోలీస్, ప్రభుత్వాల పవర్, ఇండియన్స్ గొప్పతనం, భారతీయుల మంచితన..ఇలా మన భారదేశానికి సంబందించిన ఎన్నో అంశాలను ఇందులో చూపించాడు కృష్ణ వంశీ. ఈ సినిమా రిలీజ్ అయ్యాక దాదాపు 10 రోజులపాటు అండర్ గ్రౌండ్‌లో ఉండాల్సి వచ్చింది.
ఇలాంటి, సంచలనాత్మకమైన సినిమాను తీసినందుకు ఆయన ఎప్పుడూ గర్వపడుతుంటాడు. స్వాతంత్ర్యదినోత్సవం నాడు ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆనందిస్తుంటారు. ఇక, ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటానికి మాటలు సరిపోవు. ఈ సినిమాను ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని తర్వాత జనరేషన్ వాళ్ళు కథ తయారు చేయాలన్నా, సినిమా చేయాలన్నా కృష్ణ వంశీకి ఉన్న ధైర్యం, గట్స్ ఉండవనే చెప్పాలి. మొత్తానికి, ఈ ఆగస్టు 15న ఖడ్గం రీ-రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.












