National

బీజేపీ ‘రివర్స్‌ అటాక్‌’ మొదలైందా? 2029 వరకు ఇదే వ్యూహమా?

రచన: Kashi•••7 నిమిషాల పఠనం

పార్లమెంట్‌ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు కనిపించాయి. విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ ఆందోళనలు చేస్తుంటే.. ఎన్డీయే ఎంపీలు కూడా మకర్‌ ద్వార్‌ వరకు ర్యాలీ నిర్వహించి విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీన్ని బీజేపీ రాజకీయ కమ్యూనికేషన్‌లో వస్తున్న మార్పులో భాగంగా చూడాల్సిందే అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఎన్డీయే వ‌ర్సెస్ ఇండి కూట‌మి

ఢీ అంటే ఢీ అంటున్న అధికార- విప‌క్షాలు

బీజేపీ రివ‌ర్స్ ఎటాక్ స్ట్రాట‌జీ

2029 వ‌ర‌కు ఇదే వ్యూహ‌మా..?

పార్లమెంట్‌ వేదికగా ఇప్పటివరకు కనిపించిన రాజకీయ పోరు ఒక ఎత్తయితే.. ఇప్పుడు మొదలైన రివర్స్‌ అటాక్‌ మరో ఎత్తు. విపక్షాలు ఏ అంశాన్ని పట్టుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయో.. అదే అంశంపై అధికార పక్షం కూడా కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతోంది. తాజాగా పార్లమెంట్‌ ఆవరణలో ఎన్డీయే ఎంపీలు చేపట్టిన నిరసన ఈ మారుతున్న రాజకీయ వ్యూహానికి సంకేతమా? 2029 ఎన్నికల వరకు బీజేపీ ఇదే ఫార్ములాను కొనసాగించబోతోందా? అన్న చర్చ మొదలైంది.

పార్లమెంట్‌ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. ఇవాళ అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు కనిపించాయి. విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ ఆందోళనలు చేస్తుంటే.. ఎన్డీయే ఎంపీలు కూడా మకర్‌ ద్వార్‌ వరకు ర్యాలీ నిర్వహించి విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభను అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ ఘటనను ఒక్కరోజు నిరసనగా చూడొద్దంటున్నారు విశ్లేష‌కులు. దీన్ని బీజేపీ రాజకీయ కమ్యూనికేషన్‌లో వస్తున్న మార్పులో భాగంగా చూడాల్సిందే అని చెబుతున్నారు.

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్

ఇప్పటివరకు బీజేపీపై విపక్షాలు తరచుగా ఒకే రకమైన రాజకీయ ఒత్తిడి పెడుతూ వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందుంది. విద్యార్థుల ఆందోళనలు, ప్రభుత్వ నిర్ణయాలు, బిల్లులు.. ఇలా ఏ అంశం దొరికినా కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ నిరసనలు చేపట్టడం, మీడియా ఫోకస్‌ను ఆ అంశం వైపు తిప్పడం విపక్షాల వ్యూహంగా కనిపించింది.

కానీ ఇప్పుడు బీజేపీ కూడా అదే పద్ధతిలో కౌంటర్‌ నేరేటివ్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తోందా? అన్నదే అసలు ప్రశ్న.

అంటే.. ఇక నుంచి విపక్షాలు ఒక ఆరోపణ చేస్తే దానికి సమాధానం ఇవ్వడమే కాదు.. అదే సమయంలో విపక్షాలపై మరో ఆరోపణను తెరపైకి తీసుకురావడం. విపక్షాలు నిరసన చేస్తే.. బీజేపీ కూడా నిరసన చేయడం. విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తే.. బీజేపీ కూడా ప్రతిపక్షాల వైఖరినే ప్రజల ముందుకు తీసుకెళ్లడం.. ఈ వ్యూహంలో భాగంగా క‌నిపిస్తోంది.

తాజాగా పార్లమెంట్‌ ఆవరణలో కనిపించిన దృశ్యాలు ఈ మార్పున‌కు ఉదాహరణగా నిలిచాయి.

ఇది కేవలం పార్లమెంట్‌ వ్యూహమేనా?

ఇక్కడే 2029 ప్రశ్న తెరపైకి వస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. జాతీయ రాజకీయాల్లో దీనిపై అప్పుడే చ‌ర్చ మొద‌లైంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్ప‌టి నుంచే అధికార‌- విప‌క్షాలు సిద్ధ‌మ‌య్యాయ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. బీజేపీకి ఇప్పుడు కేవలం ప్రభుత్వాన్ని నడపడం మాత్రమే కాదు.. ప్రతిపక్షాల నేరేటివ్‌ను ఎదుర్కోవడం కూడా కీలకంగా మారింది.

విపక్షాలు ‘ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అంటే.. బీజేపీ ‘విపక్షాలే సభను అడ్డుకుంటున్నాయి’ అనే కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంటే ప్రశ్నకు సమాధానం చెప్పే రాజకీయంతో పాటు.. ప్రశ్న అడుగుతున్నవారినే ప్రశ్నించే రాజకీయానికి బీజేపీ మరింత ప్రాధాన్యం ఇవ్వబోతోందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

‘డిఫెన్స్‌’ నుంచి ‘అటాక్‌’కు?

బీజేపీ రాజకీయ శైలిలో మరో కీలకమైన మార్పు ఇదే కావచ్చు. విపక్షాలు ఏదైనా అంశాన్ని ముందుకు తెచ్చిన తర్వాత దానికి వివరణ ఇవ్వడం మాత్రమే కాకుండా.. వెంటనే కౌంటర్‌ అంశాన్ని తెరపైకి తీసుకురావడం. తద్వారా చర్చ మొత్తం ఒకే అంశం చుట్టూ తిరగకుండా చేయడం. ఇది రాజకీయంగా చాలా కీలకమైన వ్యూహం.

ఎందుకంటే ఎన్నికల్లో కేవలం ప్రత్యర్థి తప్పులను ఎత్తిచూపడం సరిపోదు. ప్రత్యర్థి ఎంచుకున్న అంశాన్ని కూడా తనకు అనుకూలంగా మలచగలగాలి. బీజేపీ ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తోందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

2029 వరకు ఇదే గేమ్‌ప్లాన్‌?

తాజాగా పార్లమెంట్‌లో కనిపించిన పరిణామాలను చూస్తే.. బీజేపీ ఇకపై విపక్షాల అజెండాకు స్పందించడం కంటే విపక్షాల అజెండాకు కౌంటర్‌ అజెండా పెట్టడంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశముందన్న చర్చ మొదలైంది.

ఈ వ్యూహం పార్లమెంట్‌కే పరిమితం కాకపోవచ్చు. సోషల్‌ మీడియా, సభలు, మీడియా డిబేట్లు, రాష్ట్రాల రాజకీయాలు.. ఇలా ప్రతి వేదికపై కౌంటర్‌ నేరేటివ్‌ బీజేపీ రాజకీయాల్లో మరింత బలపడే అవకాశం ఉంది. తాజాగా పార్లమెంట్‌ ఆవరణలో జరిగిన ఎన్డీయే నిరసన.. ఒక చిన్న రాజకీయ ప‌రిణామం కంటే పెద్ద సంకేతంగా కనిపిస్తోంది. విపక్షాలు దాడి చేస్తే సమాధానం ఇవ్వడం కాదు.. దాడికి దాడితోనే కౌంటర్‌ ఇవ్వడం.. ఈ ఫార్ములాలో భాగం.

#BJP#BJP Strategy#BJP Reverse Attack#Narendra Modi#Rahul Gandhi#Parliament#Parliament Monsoon Session#2029 Elections#BJP vs Congress#Congress#NDA#INDIA Alliance#Indian Politics#Parliament Protest#Political Strategy#Modi Rahul Gandhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి