వైరల్ న్యూస్

Viral video: ‘రేవంత్ రెడ్డి మళ్లీ గెలిస్తే సచ్చిపోతా..’ కాంగ్రెస్ పాలనపై రైతు ఆవేదన!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఓ సాధారణ పౌరుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సదరు వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ‘రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను సచ్చిపోతా..’  అంటూ కాంగ్రెస్ పాలనా తీరుపై తన ఆవేదనను వెల్లగక్కాడు.

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఓ సాధారణ పౌరుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సదరు వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ‘రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను సచ్చిపోతా..’  అంటూ కాంగ్రెస్ పాలనా తీరుపై తన ఆవేదనను వెల్లగక్కాడు.

సదరు రైతు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ సరైన విధంగా అమలు కావడంలేదని తేల్చిచెప్పాడు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పక్కాగా అమలు కావడం లేదని మండిపడ్డాడు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు డూప్లికేట్ చెక్కులు ఇస్తూ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా, రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం విషయంలోనూ దొడ్డు బియ్యాన్ని కేవలం పాలిష్ చేసి, సన్న బియ్యం అని నమ్మించి ప్రజలకు ఇస్తున్నారంటూ తెలిపాడు.

 కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు రైతు, రేవంత్ రెడ్డి పాలనలో రైతుబంధు డబ్బులు మొదట్లో ఒక్కసారి మాత్రమే వేశారని, ప్రస్తుతం సాగునీటి సౌకర్యం కూడా సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మార్పు’ అంటూ ఏమీ లేదని, గతంలో కేసీఆర్ పాలనే చాలా బాగుండేదని స్పష్టం చేశాడు. 2035 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి మళ్లీ ఓటు వేస్తే చెప్పుతో కొట్టుకుంటానని తెగేసి చెప్పాడు.

 అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ‘ఒక్క పని కూడా చేతకాదు’ అంటూ రాయలేని భాషలో తిట్టాడు. హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను వంచిస్తున్నందున, కాంగ్రెస్ నాయకులు గానీ, పార్టీ కార్యకర్తలు గానీ ఓట్ల కోసం లేదా ఇతర పనుల కోసం నా ఇంటి ముఖం కూడా చూడవద్దని, తన ఇంటికి రావొద్దని తెగేసి చెప్పాడు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన వ్యక్తపరిచిన ఈ ఆగ్రహం నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ వీడియో, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి అద్దం పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

#RevanthReddy#CongressGovernment#TelanganaFarmers#KCR#TelanganaPolitics#ViralVideo#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి