సినిమా

Sambarala Yeti Gattu: సంక్రాంతి బరిలో సుప్రీమ్ హీరో..

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Sambarala Yeti Gattu: మన తెలుగు సినిమాలకే కాదు, ఇతర సౌత్ భాషలలోని సినిమాలకి సంక్రాంతి పండుగ అనేది పెద్ద సీజన్. వరుసగా వచ్చే సెలవులను టార్గెట్ చేసుకొని చిన్న సినిమా నుంచి పాన్ ఇండియన్ సినిమాల వరకూ బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతుంటాయి. సంక్రాతికి మూడు రోజుల్లోనే భారీ వసూళ్ళు రాబట్టి బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. 2027 సంక్రాంతికి కూడా ఇలాంటి భారీ పోటీ నెలకొంది.

వారిలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. ఈ మెగా హీరో నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై దాదాపు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక, ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది.

ఇదే బ్యానర్‌ నుంచి గతంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమా జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఊహించని ఘనవిజయం సాధించింది. ఇప్పుడు, అదే సెంటిమెంట్‌తో ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాను కూడా 2027, జనవరి 12వ తేదీన పాన్ ఇండియా వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

‘సంబరాల ఏటి గట్టు’ సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా..ఇలా భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఇతర సినిమాల నుంచి కూడా గట్టి పోటీ నెలకొనబోతోంది. అయితే, ఏ సినిమా బావుంటే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందనడానికి గతంలో చాలా ఉదాహరణలున్నాయి. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి.. కీలక పాత్రల్లో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కనిపించబోతున్నారు.

#SambaralaYetiGattu#SaiDharamTej#RohithKP#AishwryaLakshmi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి