Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ‘ముఠా మేస్త్రి’ చిత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆయన రాజకీయాలలోకి వస్తారనే విషయాన్ని ఇలాంటి సినిమాల ద్వారానే ముందుగా ప్రేక్షకుల్లోకి, అభిమానుల్లోకి చొప్పించారు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ రేంజ్ వేరే లెవల్.
అయితే, ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రి’ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. 4కె వెర్షన్ లో లేటెస్ట్ సౌండ్ సిస్టంతో ఆగస్టు 21వ తేదీన దేశ వ్యాప్తంగా ‘ముఠా మేస్త్రి’ రిలీజ్ కానుంది. అప్పట్లో, ఈ సినిమా ఒక సంచలనం. మ్యూజికల్ గా పెద్ద హిట్. రాజ్-కోటి అందించిన సాంగ్స్ ఇప్పటికీ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమాకి దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి. హీరోయిన్స్‌గా మీనా, రోజా నటించారు.
గత కొంతకాలంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ-రిలీజ్ కల్చర్ బాగా ఎక్కువైంది. అప్పట్లో, బ్లాక్ బస్టర్స్ సాధించిన చిత్రాలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైనా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న సినిమాలను డిజిటలైజ్డ్ చేసి 4కె వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ లో చాలా సినిమాలు మంచి కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. అలా, ఇప్పుడు మెగా స్టార్ బర్త్ డేకి ‘ముఠా మేస్త్రి’ రీ రిలీజ్ కాబోతోంది.
ఇక, ప్రస్తుతం చిరు..బాబీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా టైటిల్ తో పాటు విజువల్ ట్రీట్ కూడా ఉండబోతుందట. ఇందులో, అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోంది. మురళీ శర్మ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే, ఆయన కొత్త సినిమాలకి సంబందించిన అప్‌డేట్స్ కూడా రానున్నట్టు తెలుస్తోంది.












