పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి
10 కుటుంబాల పేరుతో 170 ఎకరాలకు విక్రయం
సమస్య పరిష్కారం కోసం ఆనాటి సీఎం కుటుంబ సభ్యుల కొనుగోళ్లు?
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కటిగా బట్టబయలు
రిజిస్ట్రర్ కాకుండానే జీపీఏలు చేయించుకున్న 1960 నాటి ఎంపీ దుగ్గిరాల
పార్టీషన్ పేరుతో హక్కులు, అమ్ముకున్నామని సీలింగ్ లో డిక్లరేషన్స్
ఇనాం భూముల్లో ఓఆర్సీలు
మళ్లీ అవే భూములపై 2007, 2012, 2019లో వివిధ వ్యక్తులకు జీపీఏలు ఇచ్చిన వారసులు
ఆదిత్య యాదవ్ ఎంట్రీతో వేడెక్కిన వ్యవహారం
1966లో 88 ఎకరాలు ఉందంటూ రిజిస్ట్రేషన్ తో పేపర్స్ పై 300 ఎకరాలు అమ్మిన ఆంధ్రా భూ మాఫియా?
సీఎంవో అంటూ సీఐడీ అధికారులకు ఫోన్ చేసింది
ఉదయ్ సింహా అంటూ అనుమానాలు?
ఒత్తిళ్లతో పనులు చేస్తే అందరూ జైలుకెళ్లడు ఖాయం?
బొమ్మరాసిపేట్ భూములపై భూ మాఫియా ఊహలు
విస్తుపోయే నిజాలతో స్వేచ్ఛ ఛైర్మన్
దేవేందర్ రెడ్డి డిటెయిల్డ్ కథనం..
సేల్ డీడ్ కాకుండానే 21 మంది నుంచి జీపీఏ చేయించుకున్న మాజీ ఎంపీ దుగ్గిరాల?
1965న ఈస్ట్ హైదరాబాద్, మల్కాజిగిరి తాలుకాలో 1,049 ఎకరాలను విజయవాడకు చెందిన నేత కొనుగోలు చేయాలని అనుకుంటారు. బంధువులు, వారసుల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. సొంత కొడుకు, కూతురు, దగ్గరి బంధువుల నుంచి భూములు అధికారికంగా కొనుగోలు చేయకుండానే రిజిస్ట్రర్ జీపీఏ 83/1965 తో పాటు 13/1965, 56/65 తో అన్ని క్రయ, విక్రయ హక్కులు ఉంటాయని 21 మందితో 4 జీపీఏలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు సేల్ డీడ్స్ ద్వారా పట్టాదారుడు అయిన రెహ్మత్ అలీ, ఇతరుల నుంచి డాక్యుమెంట్ నెం. 436/1965, 437/1965 తో 1,049 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జీపీఏ లైవ్ లో ఉండగానే 1966లో డాక్యుమెంట్ నెం. 207/1966 తో పార్టీషన్ చేసుకున్నారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు అయ్యాయి. ఆనాడే రియల్ ఎస్టేట్ లా అలోచించి దుగ్గిరాల అర్ధికంగా హైదరాబాద్ భూములపై వ్యాపారం మొదలు పెట్టారు. 1970 నుంచి 1982 వరకు 600 ఎకరాలు రిజిస్ట్రర్డ్ సేల్ డీడ్ చేశారు. సంతకాలు ఫేక్ అయితే వేలి ముద్రలు , సంతకాలు ఫోరెన్సిక్ కి పంపి క్రాస్ చెక్ చేసుకొనే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. అలా కొనుగోలు చేశారనే వారికి ఇప్పటికి కేసులు పెట్టవచ్చు. టెక్నాలజీ లేదని ఆరోపణలు చేస్తే, వీళ్లకు అమ్మిన రెహ్మతుల్లా కూడా ఫేక్ సంతకాలు అని నిరూపిస్తారా? 1965 లో నిజంగా వీళ్లు కొనుగోలు చేస్తే 1982 వరకు కూడా రిజిస్ట్రేషన్ కొనుగోలు నిజమే కదా? ఎందుకు అబద్దాల ప్రచారంతో అమ్మలేదని చెబుతున్నారు?
2016లో చేతులు కాల్చుకున్న అప్పటి బీఆర్ఎస్ మంత్రి
బీఆర్ఎస్ హయంలో దక్షిణ తెలంగాణలో భూములపై భారీగా సంపాదించుకున్న ఓ మంత్రి 2016లోనే ఈ శామీర్ పేట్ లోని బొమ్మరాసిపేట్ ల్యాండ్స్ లోకి దూరారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనను నమ్ముకున్న 10 కుటుంబాలు , దేవిరెడ్డి, కట్టా, చింతకుంట్ల, మందల, జిన్నే, బొబ్బ, నేరేళ్ల, గాయం, గుండా , ముప్పిడి ఇంటి పేర్లు ఉన్న సుమారు 25 మందికి వారికి ఎక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారో తెలియకుండానే రిజిస్ట్రేషన్ యాక్ట్ 32(ఏ) ప్రకారం వేలిముద్రలు, ఫోటోలు ఇచ్చారు. వీళ్లందరి తరుపున మండల సూర్య నారాయణరావే రిజిస్ట్రేషన్ హక్కులు పొందాడు. ఇందుకు బ్యాంక్ ట్రాన్సఫర్, చెక్స్ అంటూ ఏమీ ప్రస్తావించకుండా ఎకరానికి 17 లక్షల 50 వేలు మార్కెట్ విలువ ఉన్నట్లు చూపిస్తూ డబ్బులు ఇచ్చినట్లు సేల్ డీడ్ లో చూపించారు. ఆ మొత్తం విలువ రూ.25 కోట్లు , బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు సేల్ డీడ్ రూపంలో మాజీ మంత్రి చేసుకున్నారని ఆరోపణ లేకపోలేదు. దీంతో ఈ భూములను కొట్టేయొచ్చని భావించినా ఫీల్డ్ లో 1970 నుంచి సేల్ డీడ్స్ చేసుకుని ఉన్న వాళ్లు ఉండటంతో ఏం చేయలేకపోయారు. ఇందుకు సీఐడీ లో కేసు నమోదు అయిన సందర్భంలో "ఈ భూములు మేము కొనుగోలు చేయలేదు. సంతకాలు తీసుకొని వెళ్లారు అంతే" అంటూ స్టేట్మెంట్ లో కొంతమంది కొనుగోలుదారులు చెప్పారు. ఈ భూములు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు అని పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్వో వెంకట రమేష్ చంద్రారెడ్డి ఆ తర్వాత ఏసీబీ దాడుల్లో భారీ నగదుతో పట్టుబడ్డారని తెలుస్తుంది. ఇదంతా మండవ గౌతమి క్రిష్ణ కుమారి ఇచ్చిన అన్ రిజిస్ట్రర్ జీపీఏతో దుగ్గిరాల యుగేధర్ బాబు చేసిన నాటకం. 2011లోనే ఈ జీపీఏను రద్దు చేసినట్లు పేపర్ ప్రకటన, కోర్టులో సివిల్ సూట్ వేసుకుని ఆ తర్వాత వాళ్ల వారసులకు జీపీఏ చేశారు. రద్దయిన జీపీఏలతో ఎలాంటి పొజిషన్ లేకుండానే 170 ఎకరాలకు సేల్ డీడ్స్ చేశారు. ఇదే రద్దయిన డాక్యుమెంట్స్ తో బెదిరించి 5 ఎకరాలు మరో సేల్ డీడ్ చేసి రూ.80 లక్షలు తీసుకున్నాడు. వీటిపై కేసు నమోదైంది.
రింగ్ రోడ్డు రాకతో భూమ్
1980 నుంచి 2000 వరకు కబ్జాలు చేశారని చెప్పుకుంటున్న వారికి ఆ రోజుల్లో అక్కడ ఏమీ అభివృద్ధి లేదు. 2002లో అమ్మకం జరపగా మిగిలిన భూములను మాత్రమే కొంత మంది గౌతమి అంటూ 60 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సివిల్ సూట్ లో కాని, క్రిమినల్ కేసులో కాని ప్రూవ్ చేయలేకపోయారు. ఎల్బీనగర్ కోర్టులో ఓఎస్ 426లో 7 ఎకరాల పైన మాత్రమే డాక్యుమెంట్ రద్దు చేయాలని తీర్పు వచ్చింది. ఇప్పటికి అప్పిల్ లో కేసు విచారణ జరుగుతోంది. రింగ్ రోడ్డు సమయంలో భూములు అంతా మనవే అంటూ అమ్ముకున్న విజయవాడ బ్యాచ్ ఆశలు పెరిగాయి. అప్పటికే సీలింగ్ లో వాళ్లు అంతా అమ్ముకున్నట్లు డిక్లరేషన్ ఇచ్చారని ఫైల్ నెంబర్స్ ఉన్నాయి. 255 ఎకరాల ఇనాం ల్యాండ్స్ పై 1976 లోనే ఓఆర్సీ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవి ఫేక్ అంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఓఆర్సీ లేకుండా జీపీఏలతో సేల్ డీడ్ చేస్తే అవి చెల్లుతాయా? రింగ్ రోడ్డులో భూ పరిహారం డబ్బులు అంతా ఇప్పుడున్న వారికే వచ్చాయి. అయితే ఇనాం భూములపై హైకోర్టు పుల్ బెంచ్ తీర్పు తర్వాత మళ్లీ మాయమాటలతో రాజీకీయ నాయకుల పేర్లు చెప్పి తెరపైకి తీసుకొస్తున్నారు.
88 ఎకరాలను 300 ఎకరాలుగా పేపర్స్ పై అమ్మకం
1,049 ఎకరాల్లో 88 ఎకరాలకు గాను షెడ్యూల్ 13 ప్రాపర్టీ ఓనర్ మండవ గౌతమి క్రిష్ణ కుమారి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ భూముల పైనే రిజిస్ట్రర్ జీపీఏ నెం. 83/1965 లో దుగ్గిరాల బలరామకృష్ణయ్యకు హక్కులు ఇచ్చింది. ఆ తర్వాత పార్టిషన్ డీడ్ అయినా, మనుషులు బతికే ఉండటం, జీపీఏ క్యాన్సిల్ చేసుకోకపోవడం బలరామకృష్ణయ్య 36 ఎకరాల ఇనాం ల్యాండ్ పై క్రయ విక్రయాలు జరిగాయి. అయితే రింగ్ రోడ్డు ఆశలతో 2007 అన్ రిజిస్ట్రర్ జీపీఏతో ఇక్కడ కూడా గౌతమి సంతకాలు వివిధ సంతకాలతో పొలిస్తే తేడాగా ఉన్నాయి. దుగ్గిరాల యుగేందర్ బాబు చౌదరి 2009లో 1814 గుంటలకు పొజిషన్ లేకుండానే 1965 డ్యాకుమెంట్ అంటూ సేల్ డీడ్ చేశారు. ఇదే డాక్యుమెంట్స్ తో 2010లో కొండ మోహన్ రెడ్డికి గౌతమికి సంబంధించిన 43 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. మరో 200 ఎకరాలు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు. ఇలా అన్ని అక్రమంగా చేస్తున్నందున తాము ఇరుక్కుంటామని తెలిసి ఆ జీపీఏను రద్దు చేసుకుంటున్నట్లు 2011లో ఈనాడు పేపర్ లో యాడ్ ఇచ్చారు. మళ్లీ మొత్తం 88 ఎకరాల 16 గుంటలకు 2012లో రిజిస్ట్రర్ జీపీఏ 2378/2012 వాళ్ల కుమారిడికి , కూతురికి ఇచ్చారు గౌతమి కృష్ణ. జీపీఏ 2011లోనే రద్దు అయినట్లు 591/2012 కేసు కూడా ఫైల్ చేశారు. కాని ఇవ్వన్ని మభ్యపెట్టి 2016లో రద్దయిన జీపీఏతో దుగ్గిరాల లీలా యుగేంధర్ బాబు చౌదరి జూన్, జూలైలో రూ.25 కోట్ల మనీ ల్యాండరింగ్ స్కాం చేసి మళ్లీ అదే పొజిషన్ లేని భూమిని అమ్మారు. మళ్లీ రైతులతో అదే భూమిని అక్టోబర్ 2016 లో కాంప్రమయిజ్ చేస్తున్నట్లు 80 లక్షలు డబ్బులు తీసుకుని 15 ఎకరాలకు సేల్ డీడ్ చేశాడు. 2016లో 170 ఎకరాలు మాజీ మంత్రి అనుచరులకు అమ్మేశారు. 170 ఎకరాల్లో అప్పటికే అమ్మిన గౌతమి నుంచి 70 ఎకరాలు, కొల్లి లలితా కవిత కుమారి నుంచి 88 ఎకరాలతో చేయించుకున్నారు. మళ్లీ అదే ఏడాది ఫిబ్రవరిలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పేరుతో రాజారాం ఎంటర్ ప్రైజెస్ 66 ఎకరాలు 2 కోట్ల 31 లక్షలకు అమ్మకం జరిపాడు. ఈ బాగోతాన్ని ఈనాడు ముందుండి నడిపిస్తున్న నేతలు గ్రహిస్తారా? అధికారులకు కనీసం రికార్డులు చూసే సమయం అయినా ఉంటుందా? లేకపోతే మరే ప్రభుత్వం వచ్చినా అందరూ జైలుకు పోవడం ఖాయమేనా?
2019లో వచ్చిన అమెరికా ఆదిత్య యాదవ్ బ్యాచ్
నిత్యం అమెరికా తిరిగే గొనే ప్రకాశ్ రావు అయనకు ఉన్న అవేశాలతో 5 ఏండ్ల ఎమ్మెల్యే పదవిని 6 నెలల్లో కొల్పోయారు. అలానే ఈ భూ మాఫియా గురించి తెలియకుండానే, ఓపెన్ గా మాట్లాడే ప్రకాశ్ రావు, అన్ని సరిగ్గా ఉన్నాయని నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. అందులో ఆనాటి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ భూములు కొనుగోలు చేశారని చెప్పడంతో ఆ సంగతి నేను చూసుకుంటా అంటూ రంగంలోకి దిగారు. నిజాలు ఏంటో తిలియకుండానే అబద్దాన్ని ప్రచారం చేశారు. లియోనియాలో ఆదిత్య యాదవ్ తో కూర్చొని సెటిల్మెంట్స్ చేసుకుంటూ , అయన పేరు వాడుకుని డబ్బులు వసూలు చేశారు. 70 ఏండ్లు నిజాయితీగా బతికిన గోనే ప్రకాశ్ రావు చెప్పింది నిజమే అని నమ్మి ఈ 8 ఏండ్లలో పెట్టుబడి పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి ఆయననే ముందు పెట్టి ఈ మాఫియా కొనసాగిస్తోంది. సీఎంవోలో ఉదయ్ సింహా పేర్లతో ఫోన్స్ చేస్తూ సీఐడీ విచారణకు అడ్డు తగిలారు. గొనే ప్రకాశ్ రావుని నమ్మి డబ్బులు ఇచ్చిన వారి కోసం నానా పాట్లు పడుతూ, తాను నమ్మిందే రెవెన్యూ అంటూ కేసీఆర్ కుటుంబ సభ్యులు కవిత బినామీల రూపంలో 22 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ నీతులు చెప్పే గోనే ప్రకాశ్ రావు ఎరగా దొరికిపోయారు. డబ్బులు పెట్టించి మధ్యలో ఇర్కున్నారు.
కోర్టులను సైతం తప్పుదారి పట్టించారని తెలుసుకున్న మాజీ మంత్రి
2000 వరకు ఎవరూ వ్యవసాయం చేయకపోతే 60 ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్స్ పుట్టాయని ఆరోపణ. గౌతమి పేరు పెట్టి అమ్మేశారని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కాని శిక్ష పడేలా ఎందుకు చేయలేదు. సివిల్ సూట్ లో 7 ఎకరాలకే డాక్యుమెంట్ రద్దుయేలా ఎందుకు తీర్పు తెచ్చుకున్నారు. అప్పటికే ఇనాం ల్యాండ్స్ తో పాటు వేరే వాళ్ల ఓనర్ షిప్ తో మరిన్ని డీడ్ అయిన వారి పరిస్థితి ఏంటి? ఫేక్ అయితే ఇప్పుడైనా క్రిమినల్ కేసులు పెట్టి ఎందుకు జైల్లో పెట్టడం లేదు. పొజిషన్ లేని భూములకు దొంగతనంగా పట్టా పాస్ బుక్ లు ఇస్తున్నారు. ఇదే యుగేంధర్ బాబుపై ఓఎస్ నెం. 591/2012 కేసు వేశారు. ఎల్బీనగర్ కోర్టులో ఇతను దొంగ అని, భూములు రాజారాం కి అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. యుగేంధర్, కొల్లి లలితా కవిత కుమారిపై గౌతమి కేసు వేయగా 2020లో పిటిషన్ డిస్మిస్ అయింది. ఈ కేసుల్లో రెండు అప్పిల్స్ కి వెళ్లారు. ఏఎస్ 231/2020, 232/2020. ఈ రెండు కేసుల్లో కునారపు రమేష్, కొల్లి లలిత కుమారి తరుపున గౌతమితో కొట్లాడారు. మళ్లీ 2021లో హైకోర్టులో రిట్ పటిషన్ నెం. 17550/2021 లో ఈ ఇద్దరి తరుపున జీపీఏ తీసుకొని తానే రిప్రజెంటేషన్ చేశారు. ఇలా ఈ భూ మాఫియా పిటిషన్స్ హైకోర్టులో కొనసాగుతుంటే, 2016లో అక్రమంగా రూ.25 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఒక్క రూపాయి కూడా వైట్ చెల్లించకుండా , బ్లాక్ మనీ నుంచి వైట్ మనీగా మార్చుకోవాలనుకున్న మాజీ మంత్రి టీం వాళ్లు రిట్ పిటిషన్ 14905/2022 ని దాఖలు చేసి మ్యూటేషన్ చేయాలని కోరుతారు. ఇలా అన్నింటిని తెలుసుకున్న ఆనాటి మంత్రి ఇప్పుడు మొత్తం వదిలేశారు. ఈనాడు సీఎంవో అంటూ ఉదయ్ సింహా బెదిరించి సిఐడీ దర్యాప్తును ఆపుతున్నాడు. మంత్రి పొంగులేటి కుమారుడి స్నేహితులకు 10 ఎకరాలు రాసి ఇవ్వడంతో రెవెన్యూ రికార్డులు కోర్టు మాడ్యుల్ రూపంలో రిజిస్ట్రేషన్ అయినా భూముల పై మళ్లీ భూ భారతి పేరుతో రికార్డులు మారుస్తున్నారు.
సీలింగ్ ఫైల్ కూడా చూడని అధికారులు.. ఇనాం గురించి పట్టించుకోని కలెక్టర్
సీలింగ్ లో ఫైల్ నెం. 1077/ఎం/75 ద్వారా 384 సర్వే నెంబర్ లో 7.38 గుంటలు గవర్నమెంట్ కి సరెండర్ చేస్తే ముగ్గురికి అలాట్ చేశారు. ఈ భూమిలో రైతులు సాగు చేసుకుంటున్నారు. కాని ఇదే భూమిని ఈ ఆంధ్రా భూ మాఫియా మూడు సార్లు అమ్ముకున్నారు. ఇవ్వేమి తెలియని 90 శాతం తెలంగాణ వాళ్లు కొనుగోలు చేసుకుంటే అంతా ఆంధ్రావాళ్లే అంటూ ప్రచారం చేసుకోని రాజకీయ నాయకుల వద్ద, సీఎంకి దగ్గర అనుకుంటున్న వారి దగ్గర భూ దాహంతో ఉన్న వారిని తప్పుదారి పట్టించి బొమ్మరాసిపేట్ భూములను బొమ్మగా చూపించి వేరే వ్యక్తుల వద్ద భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
పార్ట్ 6లో మరిన్ని నిజాలు
సీఐడీ కేసులో తాతల ఆస్తి అంటూ ఎంతోమంది బంధువులను మోసం చేసి, హైదరాబాద్ లో ఇల్లీగల్ గా దందా చేసుకుంటూ సీఐడీకి మోస్ట్ వాటెండ్ అయినా ఆయన ఇచ్చిన వివరాల లేఖ ఏంటి? ఆయన లేఖలో నేతి బీరకాయలో ఉండే నేతి ఎంత ఉందో పార్ట్ 6లో చూద్దాం.












