Slum Dog - Tabu: పూరి జగన్నాధ్ అంటే డైలాగ్స్ ముందు పేలిపోతాయి..ఆ తర్వాత హీరో కాల్చేస్తుంటాడు. ఇది, ఆయన మార్క్ సినిమా అని ఈజీగా కనిపెట్టొచ్చు. పూరి రాసినట్టుగా డైలాగ్స్ ఇంకొకరు రాయలేరని ఇండస్ట్రీలో టాప్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఒప్పుకున్నారు. ఒక్క డైలాగ్‌తో సీన్ మూడ్ మొత్తం మార్చేస్తాడు. ఎక్కడా గ్యాప్ లేకుండా ఫిల్ చేసే సత్తా ఒక్క పూరికే ఉంది.
వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు విజయ్ సేతుపతితో తీసిన స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు. పూరి మొదటి సినిమాకి కూడా ఇంతగా కష్టపడి ఉండడేమో. ఆయన సినిమాలలో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి..డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. కానీ, ముందుది మర్చిపోయి..ఆ తర్వాతదే గుర్తుపెట్టుకున్నారు. అందుకే, ఆయన లేటెస్ట్ సినిమా రిలీజ్ కి ఇంత సమయం పడుతోంది.
విజయ్ సేతుపతి వర్సెస్ టబు:
స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీలో టబు కీలక పాత్రలో నటించింది. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది టబు. ఆ తర్వాత మళ్ళీ, ఇదే సినిమా చేసింది. ఇందులో, టబు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. టబు కోసమే పూరి పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. "మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం" అనే డైలాగ్ హైలెట్ గా ఉంది. స్టేషన్‌లో విజయ్ సేతుపతి మెడపై లాఠీ పెట్టి బెదిరించే సీన్ హై నెక్స్ట్ లెవల్.
గౌరీ హెగ్డే అనే ఇన్కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ పాత్రలో టబు నటించింది. తాజాగా, ఈ పాత్రను రివీల్ చేసిన గ్లింప్స్ కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మేనన్ నటించింది. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ పతాకంపై, పూరి జగన్నాధ్, ఛార్మి, జెబి నారాయణరావు కలిసి నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, మిగతా సౌత్ భాషలలో రిలీజ్ చేయనున్నారు. త్వరలో, రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.












