Rajinikanth-Dharman: తమిళ సీనియర్ హీరోలలో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. బాబా సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకున్నాడు. అఫీషియల్‌గా కూడా బాబా సినిమా సమయంలో చెప్పాడు రజినీ. కానీ, ఈ సినిమా డిజాస్టర్ కావడంతో, ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆ తర్వాత సినిమాలకి గుడ్ బాయ్ చెప్పాలనుకున్న రజినీ మళ్ళీ సినిమాలను ప్రటిస్తూనే ఉన్నాడు.
ఆయన సినిమాలకి గుడ్ బాయ్ చెప్తే ఫ్యాన్స్ ఒప్పుకునేలా లేరు. ఇది, అర్థం చేసుకున్న రజినీకాంత్ ఆగకుండా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూనే వస్తున్నాడు. కబాలి నుంచి గత చిత్రం కూలీ వరకూ రజినీ మేనియా కోలీవుడ్‌లో కొనసాగుతోంది. త్వరలో, ఆయన నటించిన జైలర్ 2 రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 15 అనే డేట్ కూడా మేకర్స్ అనుకుంటున్నారు. దీని, తర్వాత కూడా సూపర్ స్టార్ 2 సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఆ రెండు సినిమాలు కమల్ హాసన్ నిర్మాణంలో చేస్తున్నవే.
వాటిలో "ధర్మన్" అనే చిత్రం నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ మధ్యనే "ధర్మన్" నుంచి రజినీ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి పెట్టిన ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో రజినీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నాడు. కీలక పాత్రలో రాశీ ఖన్నా కనిపించబోతోంది. అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.












