Deepika Padukone: రాకా కోసం 8 నెలల గర్భంతో సాహసం చేస్తున్న దీపిక పడుకొణ్. అవును, ఇప్పుడు ఇదే అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటి సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ఇది. తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జె్‌తో నిర్మిస్తోంది.
దీపిక ప్రస్తుతం 8 నెలల గర్భవతి..
పుష్ప ఫ్రాంఛైజీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా రాకా. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాఫియా డాన్‌గా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను అట్లీ రూపొందిస్తున్నాడు. కేవలం 5 సినిమాల అనుభవంతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
మొదటి షెడ్యూల్ ముంబైలో జరిగింది. ఆ తర్వాత దుబాయ్ సహా ఇతర దేశాలలో రాకా చిత్రాన్ని షూట్ చేయాలని ప్లాన్ చేశాడు అట్లీ. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలలో లొకేషన్స్ కూడా సెర్చ్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఆ ప్లానింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి ముంబైలోనే ప్రత్యేకంగా స్టూడియోలో వేసిన సెట్స్‌లో రాకా మొత్తం చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు దీపిక పడుకొణ్ 8 నెలల గర్భవతి. అయినా, కూడా సినిమా కోసం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆమె సన్నివేశాలను అట్లీ ఈ నెలలోనే కంప్లీట్ చేయనున్నాడు. దీని కోసం దీపిక నైట్ షిఫ్ట్స్ లో కూడా షూటింగ్ చేస్తోంది. సినిమా పట్ల తనకున్న అంకితభావం పలువురుని ఆకట్టుకుంటోంది. ఇక, ఈ దీపిక సెప్టెంబర్ నెలలో తన రెండవ బిడ్డకి జన్మనివ్వబోతోంది.












