International

USVisaCancellation: ట్రంప్ సంచలన నిర్ణయం.. 1.75లక్షల విదేశీ వీసాలు రద్దు!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

విదేశీయుల ఇమ్మిగ్రేషన్ నిబంధనల విషయంలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం, తీవ్రమైన నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడం వంటి తీవ్రమైన కారణాలను చూపుతూ దాదాపు 1,75,000కు పైగా విదేశీ వీసాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

విదేశీయుల ఇమ్మిగ్రేషన్ నిబంధనల విషయంలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం, తీవ్రమైన నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడం వంటి తీవ్రమైన కారణాలను చూపుతూ దాదాపు 1,75,000కు పైగా విదేశీ వీసాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తమ ప్రభుత్వం చేపడుతున్న నిరంతర సమీక్షా ప్రక్రియలో భాగంగానే ఈ విస్తృత స్థాయి చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ఫ్యాక్ట్ షీట్ ద్వారా నివేదించింది.

ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం, భౌతిక దాడులు, దొంగతనాలు, మాదకద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణా వంటి నేరాల్లో నిందితులుగా ఉన్న విదేశీయుల వీసాలను దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా తక్షణమే రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు లైంగికదాడి, కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి వీసాలను ఎలాంటి మినహాయింపు లేకుండా రద్దు చేశారు. తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించడమే ధ్యేయంగా వచ్చే 'బర్త్ టూరిజం'ను అరికట్టడంలో భాగంగా కూడా అనేక వీసాలను రద్దు చేయడం విశేషం.

ఈ పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ, అమెరికా వీసా పొందడం అనేది ఎవరికీ దక్కే ప్రాథమిక హక్కు కాదని, అదొక ప్రత్యేకమైన అవకాశం మాత్రమేనని స్పష్టం చేసింది. వీసా అనేది కేవలం అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి లభించే ప్రాథమిక పత్రం మాత్రమేనని, దేశంలోకి అనుమతించాలా? వద్దా? అనే తుది నిర్ణయాధికారం తమ ఇమ్మిగ్రేషన్ అధికారులకే ఉంటుందని తేల్చిచెప్పింది. తమ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల, వ్యవస్థలను దుర్వినియోగం చేసే వారి పట్ల మున్ముందు కూడా ఇదే విధమైన కఠిన వైఖరిని అవలంబిస్తామని స్పష్టం చేసింది.

అమెరికా అంతర్గత భద్రత, సరిహద్దు రక్షణను మరింత పటిష్టం చేసే దిశగా ట్రంప్ యంత్రాంగం ఈ చర్యలను వేగవంతం చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిఘా వర్గాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు (ICE) సేకరించిన రికార్డులను సమగ్రంగా విశ్లేషించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో నివాసముంటూ స్థానిక శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని గుర్తించి, వారి వీసాలను తక్షణమే రద్దు చేసి స్వదేశాలకు తిరిగి పంపించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యతో అమెరికా వెళ్లే పర్యాటకులు, విద్యార్థులు, ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

#USVisaCancellation#TrumpGovernment#MarcoRubio#ImmigrationRules#USAVisaUpdate#InternationalNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి