National

Cm Vijay : ‘నీట్, ఎఫ్‌సీఆర్‌ఏ’కు వ్యతిరేకం.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ అర్హత సాధన ప్రవేశ పరీక్ష (నీట్), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లు-2026ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం చేసింది. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.నీట్ పేపర్ లీకేజీ అంశం గత కొన్ని రోజులుగా దేశంలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది.

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ అర్హత సాధన ప్రవేశ పరీక్ష (నీట్), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లు-2026ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం చేసింది. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.నీట్ పేపర్ లీకేజీ అంశం గత కొన్ని రోజులుగా దేశంలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఏకంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చడమే ఇందుకు కారణం..

ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘యాంటీ పేపర్ లీకేజీ’ బిల్లును తీసుకువచ్చింది. ఇకమీదట జాతీయ, రాష్ట్ర స్థాయిలో పేపర్ లీకేజీలు జరిగితే భారీగా జరిమానాతో పాటే, శిక్షలు విధించనున్నారు. కాగా, ప్రస్తుతం కేంద్రం ఎఫ్‌సీఆర్ఏ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తున్నది. అయితే, అమెరికా లాంటి అగ్రదేశాలతో పాటు ఇండియాలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం విజయ్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీట్, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు-2026కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ప్రతిపక్ష డీఎంకే సైతం మద్దతు తెలిపింది.'నీట్'విధానం వద్దని, 12వ తరగతి (ఇంటర్మీడియట్) మార్కుల ఆధారంగానే వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది.

నీట్ వలన గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఖరీదైన కోచింగ్ సెంటర్ల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడుతోందని విజయ్ సర్కార్ ఆరోపించింది.దీనికి తోడు కేంద్రం తీసుకువచ్చిన ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ సవరణ బిల్లు-2026ను పూర్తిగా వ్యతిరేకిస్తూ సభలో మరో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.కాగా, ఈ కాపీలను కేంద్రానికి పంపాలని విజయ్ సర్కార్ భావిస్తుండగా.. కేంద్రం ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉన్నది.

#TVK#cm vijay#tamilanadu#FCRA#NEET#oppose
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి